నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. మాన్యంబులీయ సమర్థుఁడొక్కడు లేఁడు
మాన్యముల్ చెఱుప సమర్థులంత
యెండిన ఊళ్లగోఁడెరిగింపఁ దెశ్వఁడు
పండిన యూళ్ళకుఁ బ్రభువులంత
ఇతఁడు పేదయటంచు -నెఱిగింపడెవ్వఁడు
కలవారి సిరులెన్నఁగలరు చాలఁ
దనయాలి చేష్టలఁ దప్పెనఁడెవ్వఁడు
పెఱకాంత ఱంకెన్న పెద్దలంత
తే. యిట్టి దుష్టుల కధికార మిచ్చినట్టి
ప్రభువు తప్పులంచును మరి పలుకవలెను
భూషణ వికాస ! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
*
భావం: భూములు పదలకు పంచిపెట్టేవాడు లేడు. కాని వాటిని ఇవ్వకుండా చెడగొట్టేదిట్టలున్నారు. నీరులేక అల్లాడే గ్రామాలకు నీటివసతి ఏర్పరిచే వారు లేరుకానీ నీరు సమృద్ధితో పంటలు బాగా పండిన గ్రామాలకందరూ నాయకులే. పేదల్నిపట్టించుకోరు కానీ సిరిసంపదల్ని అందరూ పొగడేవారే. తనవారి గురించి చెప్పలు కాని ఇతరులదైతే కొండతలు చేసి చెబుతారు. ఇలాంటి వారికి పెత్తనమిచ్చిన ప్రభువులది తప్పు.