నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. తల్లిగర్భబునుండి ధనము తేఁడెవ్వఁడు
వెళ్ళిపోయెడి నాడు - వెంటరాదు
లక్షాధికారైన లవణమన్నమె కాని
మెఱుఁగుబంగారంబు మ్రింగబోఁడు
విత్తమార్జన చేసి విఱ్ఱవీగుటెగాని
కూడఁబెట్టిన సొమ్ము కుడువఁబోడు
పొందుగా మఱుగైన భూమిలోపలఁబెట్టి
దానధర్మము లేక దాచి దాచి
తే. తుదకు దొంగలకిత్తురో దొరలకవునొ
తెనె జంటీగలియ్యవా - తెరువరులకు!
భూషణ వికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార; నరసింహ! దురితదూర!
*
భావం:పుట్టేటపుడు ధనమెవ్వరూ తీసుకొని రారు. వెళ్లేనాడు తీసుకొని పోరు. ఎంత డబ్బున్నా తినేది వరిఅన్నమేకాని బంగారం కాదు. డబ్బు సంపాందించి గర్వాన్ని పెంచుకోవడం కనబడుతుంది కాని ఆ సొమ్ము తింటాడా లేదా అన్నది అనుమానమే ఉదా. తెనేటీగలు కష్టపడి తెనెను సంపాదించి దాచి చివరకు పరులకిచ్చినట్టు అవుతుందేమో.