నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. వదన బాణాసన వ్యక్తముక్తము లైన పలుకుల న్యదువాఁడి బాణతతుల
బరమర్మల క్ష్యముల్ పాయక భేదించు చుండెడి దుర్జన యోధపరుల
కదనుండ కున్నది కరుణ యార్ణపమక్ష జయము సత్యంబును శమము శౌచ
మును నివి యెద నిల్చునది శత్రు షడ్వర్గ జయమందునది శుద్ధ శాంత బుద్ధి
తే. మదముఁ గామముఁగ్రోధంబు మత్సరంబు
లోభమును మోహమును నను లోని సహజ
వైరి వర్గంబు నొడిచిన వాఁడ యొడుచు
నశ్రమంబున వెలుపలి మహితతతుల
భావం: ముఖమనే వింటి యందు వ్యక్తములై, విడువ బడిన మాటలనే వాడియైన బాణాల సమూహంతో ఇతరుల మర్మాలనే గురులను, విడవక చీలుస్తుండే దుష్టులైన యోధ శ్రేష్ఠుల చెంత నివసించకూడదు. దయ, ఋజుత్వం , ఇంద్రియ జయం, సత్యం, బహిరింద్రియ నిగ్రహం, శుచిత్వం అనేవాటిని హృదయంలో నిలపాలి. నిర్మలమైన శాంతి బుద్ధితో కామాది వైరులను ఆరుగురిని జయించాలి. గర్వం , కామం, కోపం, మత్సరం, పిసినారితనం, అజ్ఞానం అనే సహజమైన అంతశ్శత్రువుల సముదాయాన్ని ఓడించిన వాడే బహిశ్శత్రువుల సముదాయాన్ని శ్రమలేకుండా ఓడిస్తాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము