నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ ఆయురారోగ్యపు త్రార్థ సంపదలన్ని
గలుగఁజేసెడి కార్యకర్తవీవె
చదువులెస్సగ నేర్పి సభలో గరిష్ఠ్ధా
కార మొందించెడి ఘనుఁడవీవె
నడక మంచిది పెట్టి నరులు మెచ్చెడునట్టి
పేరు రప్పించెడి పెద్దవీవె
బలుపైన వైరాగ్య భక్తిజ్ఞానములబ్బి
ముక్తిఁ బొందించెడి మూర్తివీవె
తే అవనిలో మానవులకెల్ల నాసలిచ్చి
వ్యర్థులను జేసి తెలిపెడి వాఁడవీవె
భూషణ వికాస! శ్రీ ధర్మపురనివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!

భావం: ఓ నరసింహస్వామీ! లోకంలో ఆయుష్షు, ఆరోగ్యం, సంతానం, ధనం మొదలైన సంపదల్ని ఇస్తావు. మంచి చదువులు నేర్పి సభలలో గొప్ప గౌరవం గల్పిస్తావు. ప్రవర్తనని చక్కదిద్ది పేరు ప్రఖ్యాతులు గల్గేటట్లు చేస్తావు. భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని ఇచ్చి ముక్తిని ప్రసాదిస్తావు. మానవుల్లో ఆశలు రేకెత్తించి వారిని వ్యర్థుల్ని చేస్తావు- అన్నీ నీ పనులే.