నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ దనుజారి నావంటి దాసజాలము నీకు
కోటి సంఖ్య గలుగ కొదువలేదు
బంట్ల సందడి వల్ల బహుపరాకై నన్ను
మఱచి పోకుము భాగ్యమహిమ చేత
దండిగా భృత్యులు దగిలి నీకుండంగ
బక్క బంటే పాటి పనికివచ్చు?
నీవు మెచ్చెడి పనుల్ నేను చేయఁగ లేక
ఇంత వృథాజన్మమెత్తినాను
తే భూజనులలోను నేనప్రయోజకుఁడను
గనుగ, నీ సత్కటాక్షంబు గలుగఁజేయు
భూషణ వికాస! శ్రీ దర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహా! దురితదూర!
భావం: ఓ స్వామీ! రాక్షస విరోధీ! నీకు లెక్కలేనంతమంది భక్తులున్నారు. నీ సిరిసంపదలు మరియు బంట్ల బలం చాటున నన్ను మరచిపోవద్దు. నీకు సేవకులెందరో! ఈ పేద భృత్యుని వల్ల నేవౌతుంది? నీవు మెచ్చే పనులేవి చేయలేని నిష్ప్రయోజన జన్మ నాది. ఈ జనంలో నేను వట్టి అప్రయోజకుణ్ణి. అందువల్ల నీవు దయతో చూడు.