నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. ఇహలోక సౌఖ్యము లిచ్చగించెదమన్న
దేహమెప్పటికిని స్థిరత నొంద
దాయుష్యమున్న పర్యంతంబు పటుతయు
నొక్క తీరు న నుండ దుర్విలోన
బాల్యయువత్వదుర్భలవార్థకములను
మూటిలో మునిగెడి మురికి కొంప
భ్రాంతిలో దీని ఁ గాపాడుదమనుకొన్నఁ
గాల మృత్యువు చేతఁ గోలుపోవు
తే. నమ్మరాదయ్య! ఇది మాయ నాటకంబు
జన్మమిక నొల్ల ననే్నలు జలజనాభ!
భూషణ వికాస! శ్రీధర్మ పుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురిత దూర!

భావం: ఓ నరసింహస్వామీ ఈ ప్రాపంచిక సుఖాల్ని ఆశిద్దామంటే దేహం శాశ్వతమైంది కాదు. ఇది బాల్యం, నవం, వార్థక్యవనే మూడింటితో కొట్టుమిట్టాడ ఏ మురికి కొంప. దీన్ని కాపాడుకొందాం లెమ్మనుకొంటే ఏనాడో ఒకనాడు ఇది అనుకోకుడా మృత్యువాత పడుతుంది. ఈ జీవితం మాయానాటకం. దీన్ని నమ్మరాదు. ఇక నాకు జనే్మ వద్దు. నన్ను కాపాడుతండ్రీ!