నేర్చుకుందాం

శ్రీనరసింహ శతకము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. నవసరోజ దళాక్ష! నన్ను బోషించెడి
దాతవు నీ వంచు ధైర్యపడితి
నా మనంబున నిన్ను నమ్మినందుకు దండ్రి
మేలు నాకొనరింపు నీల దేహ!
భళి భళీ! నీయంత ప్రభువు నెక్కడ జూడ
బుడమిలో నీ పేరు పొగడవచ్చు
ముందు చేసిన పాపములు నశింపగజేసి
నిర్వహింపుము నన్ను నేర్పు తోడ
తే. బరమ సంతోషమాయె నాప్రాణములకు
నీ ఋణముఁ దీర్చుకొననేర నీరజాక్ష!
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

భావం: ఓ నరసింహస్వామీ! కొంగ్రొత్త తామర రేకుల్ని బోలిన కళ్లు నీవి. నన్ను పోషించే ధర్మాత్ముడవని ధైర్యపడ్డాను. నిన్ను నమ్మినందుకు నాకు ఉపకారం చేయి. ఓ నల్లనయ్యా! బాగు బాగు నీయంత వానిని ఈ లోకంలో నేను చూడలేదు. నినె్నంత గానైన పొగడవచ్చు. నా పూర్వ పాపాలన్నింటిని ద్రుంచి నేర్పు తో నన్ను కాపాడు. నా ప్రాణానికెంతో హాయిగా ఉంది. నీ ఋణ మెన్నటికి తీర్చుకోలేను.