నెల్లూరు

రేపటి నుంచి పది పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: పదవ తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లావ్యాప్తంగా 35,536 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 532 మంది గత ఏడాది పరీక్షల్లో ఫెయిలైనవారు కాగా, 445 మంది ప్రైవేటుగా పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్నారు. మిగతావారంతా రెగ్యులర్‌గా పరీక్షలకు హాజరవుతున్నవారే. ఈ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 184 కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిలో 175 రెగ్యులర్ కేంద్రాలు కాగా, 9 ప్రైవేటు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల పర్యవేక్షణకు 64 మంది చీఫ్ సూపరింటెండెంట్‌లు, మరో 64 మంది డిపార్ట్‌మెంట్ అధికారులను సిద్ధం చేశారు. వీరి పర్యవేక్షణ, పరిశీలనలో పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 10 సమస్యాత్మక, మరో 6 అతి సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించారు. నర్సాపూర్ జడ్పీహెచ్‌ఎస్, మహ్మదాపురం, అల్లూరు, కోట జడ్పీ ఉన్నత పాఠశాలలు, అల్లూరు ఆర్‌కె జూనియర్ కళాశాల, పిడతాపోలూరులోని రత్నం పాఠశాలలను అతి సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఇక్కడ మరింత పకడ్బందీగా పరీక్షలు నిర్వహించే క్రమంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఆంజనేయులు తెలిపారు. పరీక్షా సమయంలో కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. దీంతోపాటు ఈ పరిధిలోని జెరాక్స్ కేంద్రాలు, ఇంటర్నెట్ కేంద్రాలను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మూసిఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక వసతి ఏర్పాట్ల విషయానికొస్తే.. అన్ని కేంద్రాల్లోనూ విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా బల్లలను ఏర్పాటు చేశారు. గత ఏడాది పరీక్షల్లో వెంకటగిరిలో విద్యార్థులు బల్లలు లేక నేలపై పరీక్షలు రాశారు. అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. మంచి వాతావరణంలో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. తాగునీటి వసతి, వెలుతురు సరిగా ఉండేలా గదులను ఎంపిక చేస్తున్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో ఏఎన్‌ఎం అందుబాటులో ఉంచి విద్యార్థులకు ఆరోగ్యపరమైన సమస్యలకు చికిత్సలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. జిల్లాను పదవ తరగతి పరీక్షల్లో రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో ఉంచేందుకు గత కొన్ని నెలలుగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వం తరపున అవసరమైన మూల్యాంకన సహాయంతో అవసరమైన శిక్షణను కూడా ఇచ్చారు. విద్యాభ్యాసంలో ఎంతో కీలక వారధిలాంటి 10వ తరగతి పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెబుదాం.