నెల్లూరు

సాగునీటి సమస్య కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండాపురం, మార్చి 22: కొండాపురం మండలం సాయిపేట, భీమవరప్పాడు రైతులు సాగునీటికి పడుతున్న ఇబ్బందులను జిల్లాకలెక్టర్ జానకి దృష్టికి తీసుకెళ్తానని కావలి ఆర్డీవో ఎంఎల్. నరసింహం తెలిపారు. మంగళవారం రాళ్లపాడు రిజర్వాయర్ వద్దకు వచ్చిన ఆయన అనంతరం కొండాపురంలో విలేఖరులతో మాట్లాడుతూ సోమశిల నీరు రాళ్లపాడు రిజర్వాయర్‌కు అందినప్పటి నుండి ఆ రిజర్వాయరులో తాగునీటి కోసం నిల్వ ఉంచాలన్నారు. ఈలోగా రైతులకు సాగునీరు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ తాగునీటికి ఇబ్బంది ఏర్పడితే మోపాడు రిజర్వాయరు నుండి రాళ్లపాడు రిజర్వాయరుకు నీటిని విడుదల చేసే వీలు ఉందన్నారు. ఈ విషయాలను తాను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తనని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను అర్జీల రూపంలో ఆర్డీవోకు విన్నవించారు. వాటిని పరిశీలించిన ఆయన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీఓ వెంట తహశీల్దార్ ప్రమీల, ఆర్‌ఐ సుధీర్, సాయిపేట విఆర్వో ఉన్నం బ్రహ్మానందం ఆయన వెంట ఉన్నారు.