నెల్లూరు

గోవింధ నామస్మరణల మధ్య తెప్పోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిట్రగుంట, మార్చి 22: బిలకూట క్షేత్రం ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం భక్తుల గోవింద నామస్మరణలతో బిలకూట క్షేత్రం దద్దరిల్లింది. అల్లూరు మండలం శంభునిపాలెం చెందిన పురిణి తిరుపతయ్య, పుచ్చలపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో గురుడ సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. గురుడ వాహనంపై విష్ణుమూర్తిని దర్శించుకున్న అనంతరం పుష్కరణిలో భక్తులు స్నానం చేసి స్వామివారికి తలనీలాలు సమర్పించారు. భక్థిశ్రద్ధలతో మహిళా భక్తులు పొంగలి వండి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం పుష్కరణిలో తెప్పోత్సవం భక్తులకు కనులపండువైంది. స్వామి, అమ్మవార్లను మంగళవాయిద్యాలతో కొండ నుంచి పుష్కరిణికి తీసుకురాగా వేదపండితులు అగ్నిహోత్ర వంశీకృష్ణమాచార్యులు, ప్రధాన అర్చకులు వేదగిరి వెంకట లక్ష్మీనరసింహాచార్యులు శాస్త్రోకంగా తెప్పోత్సవం కార్యక్రమానికి పుణ్యవాచనం చేసి స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. పిటి జగన్నాధం దంపతులు తెప్పోత్సవం ఉభయ కర్తలుగా, పుష్పాలంకరణ పాతబిట్రగుంటకు చెందిన కందుకూరి రాగేశ్వరావు చేశారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ జయప్రకాష్, ఆలయ కార్యనిర్వహణాధికారి డబ్బుగుంట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.