నెల్లూరు

రైలు ప్రమాదాలతో బతుకు చేజారిపోతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 3: వేసవి వచ్చిందంటే చాలు రైల్వే పోలీసులకు ఎక్కడ లేని చాకిరి ప్రారంభమవుతుంది. ఎండలు పెరిగేకొద్ది ఆందోళన కూడా పెరుగుతుంది. ఏడాది పొడవునా రైలు ప్రయాణంలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినవారి కంటే కేవలం వేసవిలోనే సంభవించే మరణాల సంఖ్య అత్యధికంగా ఉంటుంది. ప్రతియేటా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఈ ప్రమాదాలు ఎక్కువ సంభవిస్తుంటాయి. ప్రమాదాల నివారణకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా కాసింత గాలి పీల్చుకుందామని ఫుట్‌బోర్డు వరకు వచ్చి చేజారిపోయిన జీవితాలు ఎన్నో. రైలు పట్టాలు వెంట మాంసం ముద్దల రూపంలో కన్పించి శవాగారాల్లో సేదతీరుతున్న ఉదంతాలు పోలీసుల గుండెను బరువెక్కిస్తున్నాయి. ఎక్కడెక్కడి నుండో నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారు. అందమైన భవిష్యత్తును ఆలోచిస్తూ రైలు పెట్టెల్లో కునుకు తీస్తారు. నిన్న మొన్నటి దాకా వీచిన శీతల గాలలు క్రమంగా దూరమై వేసవి తాలూకు వేడి నిట్టూర్పులు రైలు పెట్టెల్లో చికాకు పెట్టిస్తున్నాయి. అప్పుడే కాస్త గేటు వరకు వెళ్లి బయటనుంచి వచ్చే చల్లగాలిని గుండెలు నిండా పీల్చుకుందామని ఆలోచన వస్తుంది. నిద్ర మత్తుతో అక్కడి వరకు వచ్చిన వారిలో కొందరు తిరిగి తమ స్థానాలకు వెళ్లడం లేదు. రైలు పెట్టెల్లో నుంచి పట్టు జారి పట్టాలపై శవాలుగా మారిపోతున్నారు. వీటిలో కేవలం వేసవిలో జరిగే ప్రమాదాలే 80 శాతం పైగా ఉంటున్నట్లు జిఆర్పీ అధికారులు చెబుతున్నారు. మృతుల్లో అత్యధికులు ఇతర రాష్ట్రాలకు చెందినవారే ఉంటున్నారు. వీరిలో అత్యధికులు ఉపాధి కోసం వివిధ రాష్ట్రాలకు తరలివెళుతున్నవారే రెండు, మూడు రోజులపాటు రైళ్లల్లో ప్రయాణించి కాసింత గాలి కోసం వచ్చి ఆనంతవాయవుల్లో కలిసిపోతున్నారు. ప్రతియేటా సగటున 100 వరకు మరణాలు సంభవిస్తుంటాయి. వీటిలో అత్యధికం రైలు నుంచి చేజారిపోతున్న కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. రైలు ప్రమాదంలో ఫుట్‌బోర్డు వద్ద నుంచి చేజారిపోయి మృతి చెందే ఘటనలు అత్యధికంగా వేసవి సీజన్‌లో పెరుగుతున్నాయి. వర్షాకాలం, శీతాకాలలో రైలు బోగీ తలుపులను ఎక్కువ మూసే ఉంచుతారు. రాత్రివేళలో అదే పరిస్థితి కేవలం స్టేషన్లు వచ్చినప్పుడు మాత్రమే ఆ తలుపులు తెరుస్తారు. వేసవిలో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వేడిగాలుల నుంచి విశ్రాంతి కోసం తలుపులు తీసి ఉంచుతారు. కొందరు ఫుట్‌బోర్డు వద్ద కూర్చొని మరికొందరు నిలుచుని ప్రయాణాలు సాగిస్తుంటారు. ఈక్రమంలో నిద్రమత్తులో కిక్కిరిసిన గేటులో పట్టు తప్పి కింద పడిపోయి ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు చాలా ఉన్నాయి. వేసవి సీజన్ ప్రారంభమైన నేపధ్యంలో రైలులో గస్తీ తిరిగే రక్షక దళం, ప్రభుత్వ రైల్వే పోలీసులు ఈ తరహా ప్రమాదాల నివారణపై దృష్టిసారించాల్సి ఉంది. రైలు ఆగిన స్టేషన్‌లో ఫుట్‌బోర్డులోని ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో పాటు రైలు తిరిగి బయలుదేరగానే తలుపులు మూసివేసేలా గస్తీ సిబ్బంది చర్యలు తీసుకుంటే ఈ ప్రమాదాలను కొంత అయినా తగ్గించవచ్చు.