నెల్లూరు

అమ్మణ్ణి అనుగ్రహం ఎవరికో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఏప్రిల్ 3: చెంగాళమ్మ పాలకవర్గ అధ్యక్ష పదవికి అధికార పార్టీ నేతల్లో తీవ్ర పోటీ నెలకొంది. ఆలయ పాలక మండలి రద్దై నాలుగు నెలలు కావస్తున్నా నేటికీ నియమించికపోవడంతో పలువురు నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ పదవి కోసం జడ్పి ఫ్లోర్ లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి సోదరుడు తనయుడు వేనాటి సురేష్ రెడ్డి, ప్రముఖ పారిశ్రామి వేత్త కొండేపాటి గంగాప్రసాద్ వర్గానికి చెందిన టిడిపి సీనియర్ నాయకుడు తిరుమూరు సుధాకర్ రెడ్డితో పాటు దొరవారిసత్రం మండలానికి చెందిన ముప్పాళ్ల వెంకటేశ్వర రెడ్డి పోటీ పడుతున్నారు. దీనికి తోడు సభ్యులకు కూడా ఆయా వర్గానికి చెందిన వారు దరఖాస్తులు చేసుకొంటున్నారు. చైర్మన్‌తోపాటు మొత్తం 12మంది పాలకవర్గంలో ఉంటారు. 12మందిలో చైర్మన్ పోగా దాతల కోటాలో ఒకరు, అర్చకుల కోటాలో ఒకరిని సభ్యులుగా నియమించగా మిగిలిన ఇతరులు 9మంది మాత్రమే ఉంటారు. 9మంది సభ్యులకు ఇప్పటికే 50మందికి పైగా దరఖాస్తులు చేసుకొని ఉన్నారు. వీరిలో కూడా ఎవరికి చోటు దక్కుతుంతో తెలియని పరిస్థితి. దీని కోసం వారం రోజుల క్రితం హైదరాబాదుకు టిడిపి పెద్దలు వెళ్లి మంత్రి నారాయణ వద్దకు వెళ్లి తమకే అధ్యక్ష పదవి కావాలని పంచాయతీ పెట్టినట్లు తెలుస్తోంది. మంత్రి మాత్రం ఆలయ విషయం వదిలి వేరే విషయం మాట్లాడంటూ కుండబద్దలు కొట్టినట్లు తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో చేసేదేమీ లేక నేతలు వెనుదిరిగారు. జడ్పి చైర్మన్ ఎన్నికల్లో దొరవారిసత్రం మండల వైకాపాకి చెందిన జడ్పిటిసి టిడిపి అనుకూలంగా ఓటు చేసేందుకు మంత్రితో పాటు ఇక్కడ పార్టీ నేతలు తమకు మద్దతు ఇస్తే చెంగాళమ్మ ఆలయ అధ్యక్ష పదవి జడ్పిటిసి భర్త వెంకటేశ్వరరెడ్డికి ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో అప్పటి నుండి ఆయన ఈ పదవిపై ఆశపెట్టుకున్నారు. జడ్పి చైర్మన్ పదవి వేనాటికి చేజారడంతో ఆలయ పాలకవర్గం తమ వర్గానికి దక్కించుకోవాలని దృష్టిసారించారు. అనంతరం మారిన సమీకరణాలతో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్, వైకాపా నాయకులు టిడిపి గూటికి చేరారు. మంత్రి నారాయణ మాత్రం ఇచ్చిన మాట ప్రకారం వెంకటేశ్వరెడ్డికే చెంగాళమ్మ ఆలయ బాధ్యత ఇవ్వాలని గట్టిగా చెప్పడంతో స్థానికంగా ఉన్న అధికార పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్ని సంవత్సరాలు పార్టీ జెండాలు మోసి చివరికి అధికారం వచ్చిన తరువాత ఇతర ప్రాంతాలకు చెందిన వారికి పదవులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జిల్లా పార్టీ నేతలు, మంత్రి తీరుపై స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి చెంగాళమ్మ ఆలయ పాలకవర్గానికి తీవ్ర పోటీ నెలకొనడంతో అందరిలోనూ ఏ వర్గానికి దక్కుతుందోనని అనుచరుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎవరికి వారు తమకే వస్తుందని ధీమాగా ఉన్నారు. దీనిపై ఈ నెల 5న హైదరాబాదులో మంత్రి అధ్యక్షతన జిల్లా నేతలతో పాటు స్థానిక నేతలు సమావేశం కానున్నారు. అమ్మణ్ణి అనుగ్రహం మాత్రం ఎవరికి దక్కుతుంతో వేచిచూడాల్సిందే మరి.