నెల్లూరు

ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి టిడిపి అధిక ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు టౌన్, ఏప్రిల్ 5: దివంగత కేంద్ర మాజీ మంత్రి జగ్జీవన్‌రాం ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కొనియాడారు. నగరంలోని ఆదిత్యానగర్‌లో ఉన్న తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఏ రాజకీయ పార్టీ బడ్జెట్‌లో ప్రవేశపెట్టని విధంగా ఎస్సీ, ఎస్టీలకు 8.700 కోట్ల రూపాయలను తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ప్రత్యేకించి నెల్లూరు జిల్లాకు 400 కోట్ల రూపాయలను వారి అభివృద్ధి కోసం మంజూరు చేశారన్నారు. నదుల అనుసంధానం క్రమంలో పట్టిసీమను దేశంలోనే అతి తక్కువ సమయంలో అనుసంధానం చేసిన సిఎం చంద్రబాబునాయుడిని పొరుగు రాష్ట్ర సిఎం చంద్రశేఖరరావు, ఇటీవల ఢిల్లీలో జరిగిన జలవనరుల శాఖ సమావేశంలో ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర మంత్రి ఉమాభారతి అభినందించారన్నారు. అయితే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నదుల అనుసంధానంపై విమర్శించడం చూస్తే ఆయన ప్రతిపక్షనేతగా కూడా పనికిరారని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. ఎంతో మంది కేంద్ర మంత్రులు సిఎంని అభినందిస్తుంటే జగన్ మాత్రం పట్టిసీమ అనుసంధానాన్ని వ్యతిరేకించడం దారుణమైన చర్య అన్నారు.