నిజామాబాద్

ఉమ్మడి జిల్లాలో 24 వేల సభ్యత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డి, డిసెంబర్ 30: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టిడిపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారంతో ముగియడంతో, 24వేల మంది టిడిపి సభ్యత్వాలు నమోదు చేయడం జరిగిందని, కామారెడ్డి జిల్లా టిడిపి అధ్యక్షుడు ఒడ్డెపల్లి సుభాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలోఆయన మాట్లాడారు. పసుపుజెండాపేదోడికి అండ అనే నినాదంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 50 వేల పార్టీ సభ్యత్వాలకు గాను 24వేల పార్టీ సభ్యత్వ నమోదు చేయడం జరిగిందన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే 6,713 మంది పార్టీ సభ్యత్వం నమోదు లక్ష్యం పూర్తిచేశామన్నారు. గత ఏడాదికంటే ఈసారి ఎక్కువ సభ్యత్వ నమోదు చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్స్‌వాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో ఈసారి ఎక్కువ పార్టీ సభ్యత్వ నమోదు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గట్టేందుకోసం జనవరి 14 పార్టీ వ్యవస్తాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జెండా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంనుంచే జెండా కార్యక్రమం ప్రారంభించడం జరుగుతోందన్నారు. పల్లెపల్లెకు జెండా కార్యాక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు పసుపుజెండా అండగా ఉంటుందన్నారు. 2019 లోవచ్చే ఏన్నికలకు పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల వలే పని చేయాలని కోరారు. సభ్యత్వ నమోదును విజయవంతం చేసిన టిడిపి నాయకులకు, కార్యకర్తలతు అభినందనలు తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి 15 సంవత్సరాలుగా ప్రజల్లో ఉంటూ, ప్రజలకు సేవ పరమావధిగా పనిచేయాల్సింది పోయి, ప్రభుత్వ అధికారులపై అధికారాన్ని చెలాయించడం అధికార దుర్వినియోగానికి పాల్పడటమే అని అన్నారు. విధి నిర్వహణలోఉన్న ఎస్‌ఐపై టిఆర్‌ఎస్ నాయకులు దాడి చేస్తుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేగా కార్యకర్తలకు 100 రూపాయల చాలన్ కోసం, ఎస్‌ఐపై ఎస్పికి ఫిర్యాదు చేయడం నిరంకుశ చర్యగా అభివర్ణించారు. బంగారు తెలంగాణలో అధికారంలో ఉన్నవారు ఇలా చేస్తే సామాన్యుల సంగతి ఎలా ఉంటుందోఅర్థవౌతోందన్నారు. అదికార పార్టీ ఎమ్మెల్యే అందరికి న్యాయంగా చూసినప్పుడే గౌరవం కలుగుతోందన్నారు. విలేఖరుల సమావేశంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షులు నాగం పరందాములు, టిడిపి నాయకులు జలంధర్‌రెడ్డి, కంచం రాములు, శ్రీనివాస్‌రెడ్డి, తిరుపతి రెడ్డి, హన్మంతు, చిరంజీవులు, హఫీజ్, బాల్‌కిషన్ తదితరులు ఉన్నారు.

రెండేళ్ల చిన్నారి బకెట్‌లో పడి మృతి
బోధన్, డిసెంబర్ 30: బోధన్ పట్టణంలోని శక్కర్‌నగర్ కాలనీలో శుక్రవారం రెండేళ్ల వయస్సు కలిగిన చందు అనే చిన్నారి ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో పడి మృతి చెందినట్లు ఎస్‌హెచ్‌వో సురేందర్‌రెడ్డి తెలిపారు. నీళ్లు ఉన్నటువంటి బకెట్‌లో పడిపోయిన చిన్నారి ఊపిరాడక మృతి చెందినట్లు కుటుంబీకులు తెలియచేశారని ఆయన వివరించారు.