నిజామాబాద్

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో నిర్లక్ష్యంపై జడ్పీ సిఇఓ ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిపేట, జనవరి 3: ఉపాధి హామీ పధకం కింద చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండల ఇజిఎస్ ఎపిఓ, సిబ్బందిపై జిల్లా పరిషత్ సిఇఓ గోవింద్‌నాయక్ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిపేట మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఇజిఎస్ అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్‌అసిస్టెంట్లకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐహెచ్‌హెచ్‌ఎల్ పథకం చేపట్టి సంవత్సరంన్నర కావస్తున్నా, ఇంతవరకు లక్ష్యం ఎందుకు పూర్తి చేయడం లేదని సిఇఓ వారిపై మండిపడ్డారు. బాధ్యతారహితంగా పని చేస్తున్న ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మండలంలో సోమవారం లోగా నిర్దేశిత మరుగుదొడ్లను పూర్తి చేయకపోతే ఆయా గ్రామాల ఫీల్డ్‌అసిస్టెంట్లను, టెక్నికల్ అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తానని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలను సకాలంలో పూర్తి చేయడంలో వెనుకబడి ఉన్నారంటూ ఎపిఓ పోశెట్టిపై మండిపడ్డారు. అలాగే గ్రామాల్లో ఇజిఎస్ కూలీలకు 100రోజుల పని కల్పించడం లేదని, 50రోజుల పని కల్పిస్తున్న కూలీలను తొలగిస్తామని స్పష్టం చేశారు. ముందుగా మండలంలోని డొంకేశ్వర్, నికాల్‌పూర్ గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను సిఇఓ పరిశీలించారు.
నెల రోజులుగా జిల్లాను ఓడిఎఫ్‌గా తీర్చాలని లక్ష్యం
జనవరి మాసాంతంలోగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసి జిల్లాను బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని జడ్పీ సిఇఓ గోవింద్‌నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ, కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని మండలాల్లో అధికారులు, ఇజిఎస్ సిబ్బందితో సమావేశాలు నిర్వహిస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా ఇజిఎస్ కూలీలకు చాలా తక్కువ సంఖ్యలో పనులు కల్పిస్తున్నారని, సిబ్బంది ఈ సంఖ్యను పెంచకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం జిల్లాలో 20వేల మంది కూలీలు మాత్రమే ఇజిఎస్‌లో పనులు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇజిఎస్ కింద ప్రస్తుతం పాంపౌండ్స్, ఐహెచ్‌హెచ్‌ఎల్ పనులు జరుగుతున్నాయని జడ్పీ సిఇఓ పేర్కొన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఇజిఎస్ రికార్డులను పరిశీలించారు. జడ్పీ సిఇఓ వెంట ఎంపిడిఓ నాగవర్ధన్ తదితరులు ఉన్నారు.