నిజామాబాద్

అంగన్‌వాడీ కార్యకర్తల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమ్‌గల్, జనవరి 20: వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు శుక్రవారం భీమ్‌గల్ తహశీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకు ముందు పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం నుండి అంగన్‌వాడీ కార్యకర్తలు ర్యాలీ తహశీల్ కార్యాలయానికి చేరుకుని, తహశీల్దార్ బావయ్యకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దేవగంగు మాట్లాడుతూ, చాలీచాలని వేతనాలతో తమ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే మారుమూల గ్రామాల్లో ఉన్న అంగన్‌వాడీలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో వేల్పూర్, సిరికొండ, మోర్తాడ్, ఏర్గట్ల, భీమ్‌గల్ మండలాలకు చెందిన అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

రోడ్డు భద్రత సామాజిక బాధ్యత
జిల్లా ఎస్పీ శే్వతారెడ్డి
గాంధారి, జనవరి 20: రోడ్డు భద్రత అందరి సామాజిక బాధ్యత అని కామారెడ్డి జిల్లా ఎస్పీ శే్వతారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక హరాళే గార్డెన్స్‌లో నగదు రహిత లావాదేవీలు, రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతీ ఒక్కరూ రోడ్డు భద్రత గురించి తెలుసుకోవాలని సూచించారు. ఇక నుండి పోలీసులు వాహనాలు నడిపే వారిపట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని వివరించారు. ద్విచక్ర వాహనాలు నడిపే వారు తప్పని సరిగా మేజర్ అయి ఉండాలని, మైనర్లు వాహనాలు నడిపితే వాటిని సీజ్ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం వారి తల్లిదండ్రులను పిలిపించి కౌనె్సలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మైనర్‌లకు వాహనాలు నడిపే విధానంపై అవగాహణ ఉండదని, వారి తల్లిదండ్రులు దీనిని గుర్తించాలని కోరారు. విద్యార్థులు ఈ విషయాల్లో ముందుండి మీరు పాటిస్తూ ఇతరులకు వివరించాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహన పత్రాలు తప్పని సరిగా ఉండాలన్నారు. దీంతో పాటు వివిధ ప్రాంతాలకు వాహనాలపై వెల్లే వారు తప్పని సరిగా హెల్మెట్ వాడడం మరువకూడదన్నారు. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం మూలంగా ఎంతో మంది ప్రమాదాల బారిన పడి మృతి చెందుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక ముందు అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. అలాగే ముగ్గురు కలసి ద్విచక్ర వాహనంపై వెల్లినా చర్యలు తప్పవన్నారు. చిన్న చిన్న నిర్లక్ష్యాలే జీవితంలో విషాదాలను నింపుతాయని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడంతోనో, చిన్నారులు వాహనాలు నడపడం మూలంగానో అనేక ప్రమాదాలు జరుగుతూ వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపడం వంటి విషయాలు అందరికీ తెలిసిందేనన్నారు. ఇలాంటి ప్రమాదాల మూలంగా విద్యార్థుల కుటుంబాల్లో గానీ వారి బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో జరిగిన విషయాలను ఎస్పీ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నగదు రహిత లావాదేవీలపై విద్యార్ధులకు వివరించారు. ఈ నగదు రహిత లావాదేవిలపై విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అవగాహణ కల్పించాలని వివరించారు. నగదు రహిత లావాదేవిలే ఎంతో మేలని వాటిని ప్రజలు అలవాటు పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డిఎస్పీ నర్సింహ, సదాశివనగర్ సిఐ శ్రీశైలం, గాంధారి ఎస్‌ఐ రాజేశ్, జడ్పీటిసి తానాజీరావు, ఎంపిడిఓ సాయాగౌడ్, సర్పంచ్ సత్యం, వేద పండితులు జ్యోషి భరత్ భూషన్, ఎంపిటిసి రాంకిషన్‌రావు, జిల్లా నెహ్రూ యువజన సంఘం కోఆర్డినేటర్ రాంచందర్‌రావు, శివ హిందూ సేన యూత్ సభ్యులు తూర్పు సందీప్, గంగాప్రసాద్, లింగమూర్తి, తాటి రమేష్, జంగం నాగభూషణం, గాండ్ల సాయిలు తదితరులు పాల్గొన్నారు.