నిజామాబాద్

విలువైన ప్రాణాలను కాపాడుకోవాలి:ఎస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, జనవరి 21: రవాణాశాఖ నిబంధనలు పాటించి వాహనదారులు తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని జిల్లా ఎస్పీ శే్వత అన్నారు. రవాణా, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో శనివారం పార్శిరాములు కల్యాణ మండపంలో నిర్వహించిన రోడ్డు భద్రత వారోత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు, ప్రజలు సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. మద్యం తాగి డ్రైవింగ్ చేసి విలువైన ప్రాణాలను కొల్పొవద్దని సూచించారు. అనంతరం జిల్లా రవాణాశాఖ అధికారి దుర్గప్రమీల మాట్లాడుతూ, రవాణాశాఖ రూపొందించిన 7 అంశాలను ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. అప్పుడే రోడ్డు ప్రమాదాలు పూర్తిస్థాయిలో తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో డిఎస్పీ ప్రసన్నరాణి, సిఐ శ్రీనివాస్‌రావు, ఎంవిఐ శ్రీనివాస్‌రావు, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

గిడ్డంగులపై దృష్టి సారించని సమైక్య పాలకులు

గిడ్డంగుల శాఖ చైర్మన్ శామ్యూల్

కంఠేశ్వర్, జనవరి 21: ఆరుగాల కష్టపడి రైతులు పండించిన పంట ఉత్పత్తులను నిల్వ చేసేందుకు ఉపయోగపడే గిడ్డంగుల నిర్మాణాలపై సమైక్య పాలకులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారని, తద్వారా రైతుల సరైన గిట్టుబాటు ధర లేకపోయినా విక్రయించి నష్టపోవడం జరిగిందని గిడ్డంగుల శాఖ చైర్మన్ శామ్యూల్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక పథకాలను అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. శనివారం నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉన్నప్పుడు ఎస్‌డబ్ల్యుజి కింద 2,90,000 గిడ్డంగులు ఉండేవని, ఆంధ్రాలోని 13జిల్లాల్లో 10లక్షల గిడ్డంగులు నిర్మించారని అన్నారు. అయితే తెలంగాణలో జరిగిన తొలి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సిఎం కెసిఆర్, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రుణమాఫీతో పాటు గిడ్డంగుల నిర్మాణాలకు ప్రభుత్వం పెద్దపీట వేయడం జరిగిందన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ఈ గిడ్డంగుల్లో నిల్వ చేసుకుని, సరైన గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా రైతు నిల్వ చేసుకున్న ధాన్యంపై 75శాతం రుణ సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. అలాగే దళితులకు మూడెకరాల భూపంపిణీ చేపట్టి, ఇప్పటికే 9వేల ఎకరాల భూమిని పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీలు, బిసి, మైనార్టీలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని చేపట్టి, ఆడబిడ్డల పెళ్లిలకు 51వేల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. అదే విధంగా రాష్ట్రంలో 36లక్షల మందికి పెన్షన్లు అందిస్త్నున సర్కార్, మార్చి నుండి ఒంటరి మహిళలకు చేదోడుగా నిలిచేందుకు నెలకు 1000రూపాయల పెన్షన్ ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా 9వేల చెరువుల పునరుద్ధరించడం జరిగిందని, దీంతో రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు అందే పరిస్థితి నెలకొందన్నారు. రైతుల పక్షాన పోరాటాలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రైతులకు మేలు చేసేందుకు తీసుకవచ్చిన భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టడం దురదృష్టకరమని, సిపిఎం పార్టీకి, నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని శామ్యూల్ పేర్కొన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు మంత్రి కెటిఆర్ కృషి చేస్తున్నారని, అలాగే గిడ్డంగుల్లో పని చేస్తున్న కార్మికులకు జీవనోపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. నాబార్డు గోదాంలను నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రావడం లేదని, అందువల్ల ప్రభుత్వమే వీటి నిర్మాణాలను చేపడుతోందని అన్నారు. విలేఖరుల సమావేశంలో గిడ్డంగుల సంస్థ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి, మహేష్, టిఆర్‌ఎస్ నాయకులు విఠల్‌రావు, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.