నిజామాబాద్

క్రమం తప్పకుండా జాతీయ లోక్ అదాలత్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, జనవరి 21: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ లోక్ అదాలత్‌ను ప్రతి రెండు మాసాలకోసారి, రెండవ శనివారం నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎంవి.హరినాథ్ తెలిపారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత సంవత్సర కాలం నుండి క్రమం తప్పకుండా జాతీయ లోక్ అదాలత్‌లు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతిసారి ఒక్కో అంశంపై ఈ లోక్ అదాలత్‌లు చేపడుతూ సమస్యలను పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. సివిల్, క్రిమినల్, బ్యాంక్ చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహనాలు తదితర అంశాలతో కూడిన కేసుల్లో ఇరు వర్గాల రాజీ మార్గమే రాజమార్గం అనే సూచనతో కేసులు పరిష్కరించడం జరుగుతోందని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, ఎల్లారెడ్డి, బిచ్కుంద కోర్టులలోనూ లోక్‌అదాలత్‌లు నిర్వహించడం జరుగుతోందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

నాట్లు పూర్తయ్యే వరకు సాగునీటిని అందిస్తాం
వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
నవీపేట, జనవరి 21: రబీలో నాట్లు పూర్తయ్యే వరకు అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని సరఫరా చేస్తామని, ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సాగునీటి విషయంలో ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని, కానీ, టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఆయన స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం నవీపేట మండలం కోస్లీ వద్ద గల అలీసాగర్ ఎత్తిపోతల పథకం స్టేజ్-1 పంప్‌హౌజ్‌ను, గోదావరి నదిలో నీటి లభ్యతను మంత్రి పోచారం పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ సంవత్సరం వర్షాకాలం ప్రారంభంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోవడం వల్ల ఎక్కువ మంది రైతులు మొక్కజొన్న, కంది, సోయాబీన్ తదితర పంటలను సాగు చేసుకోవడం జరిగిందన్నారు. ఎక్కువ నీటి అవసరం ఉన్న వరిపంట సాగుకు రైతులు దూరంగా ఉన్నారని అన్నారని అన్నారు. అయితే సెప్టెంబర్ మాసంలో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటలన్నీ నిండిపోవడంతో వాటికి జలకళ సంతరించుకుందన్నారు. ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు గాను గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని విడుదల చేయడం జరిగిందని మంత్రి గుర్తు చేశారు. ఆ తర్వాత యాసంగి పంటల కోసం ముందస్తుగా డిడిబి(డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ డెవలెప్‌మెంట్ బోర్డు)లో చర్చించి, నిజాంసాగర్, అలీసాగర్, గుత్ప, పోచారం, రామడుగు, కౌలాస్‌నాలా ప్రాజెక్టుల నుండి సుమారు 2.50లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇందులో భాగంగానే ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుండి అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా 4.9టిఎంసిల నీటిని వాడుకుంటున్నామని, ఈ నీటిని కోతల వరకు సరిపోకపోతే నిజాంసాగర్ నుండి మరో 2టిఎంసిల నీటిని రెండుమూడు తడులకు అందిస్తామని గతంలోనే ప్రకటించడం జరిగిందన్నారు. దీంతో రబీలో రైతులు పెద్దమొత్తంలో వరి పంట సాగుకు సన్నద్దమయ్యారని, అయితే సాగునీటి విషయంలో మాత్రం రైతులు ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దని మంత్రి పోచారం స్పష్టం చేశారు.