నిజామాబాద్

హరితహారంలో జిల్లాను ముందుంచుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగిరెడ్డిపేట్, జనవరి 22: తెలంగాణలోనే హరితహారం పథకంలో కామారెడ్డి జిల్లాను మొదటి స్థానంలో ఉంచుతామని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని మాల్తుమ్మెద గ్రామ శివారులో గల ఫారెస్టు రెంజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీని ఆయన పరిశీలించారు. అక్కడ లక్ష మొక్కలకు గాను కేవలం 10వేల మొక్కలను ఉత్పత్తి చేయడం పట్ల ఫారెస్టు డిప్యూటి రెంజ్ ఆఫీసర్ ఒంకార్‌పై ఆవేదన వ్యక్తం చేస్తు మెమో జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, గత యేడాది 149 లక్షల మొక్కల నాటామని, అందులో 82 శాతం మొక్కలు జీవించి ఉన్నాయన్నారు. ఈ యేడాది 154 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 120 నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నామన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద రెండున్నర కోట్లతో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోచారం ప్రాజెక్టు నుండి మాల్తుమ్మెద విత్తనోత్పత్తి క్షేత్రంలో పంటలు సాగు చేసేందుకు నేరుగా సాగునీరు అందించేందుకు నిధులు మంజూరైనట్లు తెలిపారు. కలెక్టర్ వెంట ఎంపిడిఓ రమేశ్‌నాయుడు, అటవీశాఖ సిబ్బంది తదితరులున్నారు.

ముగ్గురు దొంగల అరెస్టు
9 తులాల బంగారం స్వాధీనం
డిఎస్పీ ప్రసన్నరాణి
కామారెడ్డి టౌన్, జనవరి 22: కామారెడ్డి జిల్లా పరిధిలోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని ఇళ్లల్లో దొంగతనాలు చేసిన ముగ్గురు వ్యక్తులను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు డిఎస్పీ ప్రసన్నరాణి అన్నారు. ఆదివారం స్థానిక డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన ఫణిదీర్ స్వామి, బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన అంకేశ్ మహేశ్, కర్ని లింగం అలియాస్ ఈశ్వర్లు పలు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. పాత నేరస్థులు కావడంతో జైలులో పరిచయం ఏర్పడి దొంగతనాలకు పాల్పడ్డారు. స్వామి 14 కేసుల్లో నిందితుడు కాగా మహేశ్ 6 కేసులు, లింగం 3 కేసుల్లో నిందుతులుగా ఉన్నారని డిఎస్పీ తెలిపారు. వీరిని రైల్వేస్టేషన్ వద్ద అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. వీరి వద్ద నుండి 9 తులాల బంగారం, 18 తులాల వెండి, 2వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన టౌన్ సిఐ శ్రీనివాస్‌రావు, ఎస్‌ఐ శోభన్‌బాబు, ఐడి పార్టీ సిబ్బంది ఉస్మాన్, సరుూద్, విజయ్, నహీంలను డిఎస్పీ అభినందించారు.