నిజామాబాద్

గొర్రెల పెంపకందారులకు భారీగా సబ్సిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్సువాడ, జనవరి 22: తెలంగాణ రాష్ట్రంలోని గొర్రెల పెంపకందారులైన కుర్మ, గొల్ల, యాదవుల సంక్షేమం కోసం వచ్చే బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించి, పెద్దమొత్తంలో సబ్సిడీతో పంపిణీ చేయడం జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బాన్సువాడ నియోజవకర్గంలోని నాలుగు మండలాల గొర్రెల పెంపకందారులు, కుర్మ, యాదవ సంఘాల సభ్యులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. చేతివృత్తిదారుల సంక్షేమమే లక్ష్యంగా సిఎం కెసిఆర్ ఒక ధృడమైన సంకల్పంతో ముందుకు వెళ్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25లక్షల గొల్ల, కుర్మ, యాదవ కుటుంబాలు ఉండగా, వీరిలో కేవలం 6లక్షలు మాత్రమే చేతివృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. మిగతా వారు ఉపాధి అవకాశాల కోసం వలసలు వెళ్తున్నారని అన్నారు. సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల వారిగా కుటుంబ సర్వేలు చేపట్టడం జరిగిందన్నారు. దీంతో ఏ గ్రామంలో ఏ కులానికి చెందిన ఎన్ని కుటుంబాలు, ప్రజలు ఉన్నారనే విషయమై సర్వే నిర్వహించడం జరిగిందన్నారు. ఒక్కో కుటుంబానికి సుమారు 20నుండి 50వేల వరకు గొర్రెలను పెద్దమొత్తంలో సబ్సిడీపై అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు గొర్రెలు, మేకల పెంపకందారులకు జిల్లాకు 50కోట్ల రూపాయల చొప్పున కేటాయించే వారని, 20శాతం సబ్సిడీ, మరో 20శాతం లబ్ధిదారుడి వాటా, 60శాతం ఎన్‌సిబిసి ద్వారా రుణాలను అందించేవారన్నారు. అదే విధంగా ప్రభుత్వం అందించిన గొర్రెలతో పాటు గొర్రెలకాపరులకు సైతం ఇన్యూరెన్స్ చేయించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం అలా కాకుండా లబ్ధిదారులు కొంత వాటా చెల్లిస్తే, మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే సబ్సిడీపై అందజేయడం జరుతుందన్నారు. గొర్రెల కొనుగోలుతో పాటు షెడ్ల నిర్మాణం, పశుగ్రాసంకై విత్తనాలు, దానాను సైతం సబ్సిడీపై సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. అదే విధంగా గొర్రెలు, మేకల పెంపకందారులతో మాట్లాడి, వారి సలహాలు, సూచనలు తీసుకునేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని గొల్ల, కుర్మ, యాదవులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పోచారం కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల కుర్మ, గొల్ల, యాదవ సంఘాల నాయకులు వీరుగొండ, కల్వకంట పర్వగొండ, కోటగిరి ఎంపిపి సులోచన, బాన్సువాడ సర్పంచ్ దొన్కంటి వాణిలతో పాటు నాలుగు మండలాల తెరాస నాయకులు, గొర్రెల పెంపకందారులు పాల్గొన్నారు.

ఎంఇ వెంకటేశ్వర్లుకు కార్పొరేషన్ ఘన నివాళి
వినాయక్‌నగర్, జనవరి 22: ఓ కాంట్రాక్టర్ వద్ద 20వేల రూపాయల లంచం తీసుకుంటు ఎసిబి అధికారులకు పట్టుబడి, అవమానంతో భవనం పైనుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిన నగర పాలక సంస్థ ఎంఇ వెంకటేశ్వర్లుకు మేయర్ ఆకుల సుజాతతో పాటు పాలకవర్గం సభ్యులు, అధికారులు, సిబ్బంది ఘన నివాళులర్పించారు. ఆదివారం జిల్లా జనరల్ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం వెంకటేశ్వర్లు మృతదేహాన్ని నగర కార్పొరేషన్ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఈ సదర్భంగా మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ ఫహీంతో పాటు కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది ఎంఇ వెంకటేశ్వర్లు మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.