నిజామాబాద్

గ్రంథాలయంలో ఎగరని జెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోమకొండ, జనవరి 26: మండల కేంద్రంలోని శాఖా గ్రంధాలయం వద్ద ఇన్‌చార్జి గ్రంథపాలకుడు కుమార స్వామి నిర్లక్ష్యం వల్ల కార్యాలయంలో గణతంత్ర వేడుకలు జరగలేదు. గ్రామంలో అన్ని వర్గాల వారు వేడుకలను నిర్వహిస్తే శాఖ గ్రంథాలయం వద్ద మాత్రం జెండాను ఎగురవేసేవారు లేకపోవడంతో జాతీయ జెండాకు అవమానం జరిగిందిని గ్రామస్థులు అన్నారు. ప్రతి సంవత్సరం కార్యాలయంలో తప్పని సరిగా జెండా ఎగురుతుండేది. కానీ గురువారం జెండా ఎగురకపోవడంతో గ్రామస్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ప్రమాదవశాత్తు జాతీయ జెండా దగ్థం
కామారెడ్డి టౌన్, జనవరి 26: పట్టణంలోని అజంపుర కాలనీలో గురువారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు జాతీయజెండా దగ్ధమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. కాలనీ వాసులు ఉదయం జాతీయజెండాను ఆవిష్కరించారు. అదే కాలనీకి చెందిన కిషోర్ అనే 14 సంవత్సరాల బాలుడు అగ్గిపెట్టతో పుల్లలను అంటిస్తూ రోడ్డుపై పడెశాడు. జాతీయజెండాను ఆవిష్కరించిన డబ్బాకు కాగితం పేపర్లను అతికించారు. వీటికి అగ్గిపుల్ల మంటలు తగిలి కాగితాల ద్వారా జాతీయజెండా దగ్ధమైంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కిషోర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

పోలీసు నిఘా నీడలో గణతంత్ర వేడుకలు
వినాయక్‌నగర్, జనవరి 26: గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణలో అడుగడుగునా పోలీసు నిఘా కొనసాగింది. పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో గురువారం రిపబ్లిక్ డే వేడుకలు జరుగగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తూ వేడుకలు ముగిసేంత వరకు కూడా గట్టి నిఘా ఉంచారు. పరేడ్ గ్రౌండ్ లోనికి ప్రవేశించే ప్రధాన గేటు వద్ద మెటల్ డిటెక్టర్‌లను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా సోదాలు చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎస్‌ఐ ఆ పైస్థాయి అధికారులందరికి వాకీటాకీలు సమకూర్చారు. వేడుకలకు ఆతిథ్యమిచ్చిన పరేడ్ గ్రౌండ్ చుట్టూ బందోబస్తును ఏర్పాటు చేసి, బాంబ్ స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్ బృందాలతో అడుగడుగునా తనిఖీలు నిర్వహించారు. ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో భద్రతాపరమైన చర్యలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. ఉగ్రవాద కార్యకలాపాలతో జిల్లాకు విడదీయరాని బంధం ఉన్నట్టు ఇదివరకు అనేక సంఘటనలు స్పష్టం చేసిన దరిమిలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా విస్తృత స్థాయిలో తనిఖీలు చేపడుతూ, పరేడ్ గ్రౌండ్ వద్ద గురువారం తెల్లవారుజాము నుండే సాయుధ పోలీసు బలగాలను మోహరించారు.