నిజామాబాద్

నోట్ల రద్దును రాజకీయం చేయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, జనవరి 27: దేశంలో అవినీతి, అక్రమాలతోపాటు ఉగ్రవాదాన్ని అణచివేసేందుకే ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దు చేశారని, దీనిని ప్రతిపక్ష పార్టీలు అస్త్రంగా వాడుకుని గగ్గోలు పెట్టడం సమంజసం కాదని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో పిఎఫ్, లేబర్ కమిషన్ తదితర శాఖల ఆధ్వర్యంలో కార్మిక సదస్సు నిర్వహించగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్రమోదీ దేశంలో గత సంవత్సరం నవంబర్ 8వ తేదీన 500, 1000రూపాయల పెద్ద నోట్లను రద్దు చేయడం జరిగిందని, ఇది జరిగిన రెండు మాసాల్లో అనేక మార్పులు వచ్చాయని అన్నారు. పేదవాడి ఇంట్లో దీపం ఉండాలనే ఉద్దేశ్యంతోనే ప్రధాని మోడీ కొత్త ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టారని, ఇది పేద, సామాన్య ప్రజల అభ్యున్నతికి ఎంతో దోహదపడుతుందన్నారు. అయితే ఈ విషయాన్ని కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం రాజకీయం చేస్తున్నారని, అయినప్పటికీ 90 శాతం మంది ప్రజలు బిజెపికి మద్దతుగా నిలిచారని ఆయన గుర్తు చేశారు.
కార్మికుడి ఖాతాలోకే వేతనం
దేశంలో ట్రేడ్ యూనియన్లు సైతం ఆన్‌లైన్ విధానాన్ని హర్షిస్తున్నాయని, నోట్ల రద్దు చేసినందున కార్మికులకు వేతనాలు బ్యాంకుల ద్వారనే చెల్లిస్తున్నారని అన్నారు. వచ్చే శీతాకాల సమావేశాల అనంతరం కార్మికులకు 10వేల రూపాయల వేతనం ఉంటే, ఆ మొత్తం కార్మికుడి ఖాతాలోనే జమ చేయడం జరుగుతుందన్నారు. అలాగే కనీస వేతన చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్నామని, వ్యవసాయ కార్మికులకు, అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న కార్మికులకు, అన్‌స్కిల్డ్ వర్కర్లకు వేతనాలు పెంచుతున్నామని అన్నారు. కార్మికులు ప్రతిసారి కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతున్నారని, ఇందుకు కేంద్రం ఫైర్‌వేజ్ బెనిఫిట్స్‌ని కల్పిస్తుందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడంతో పాటు వేతన, ఉద్యోగ భద్రతను కల్పిస్తున్నామని అన్నారు. నిజామాబాద్ ఇఎస్‌ఐ ఆసుపత్రిలో 50 పడకలు ఉండేవని, ప్రస్తుతం 10 పడకలకే పరిమితమైందన్నారు. త్వరలోనే ఈ ఆసుపత్రిని ఆధునీకరించి, 50 పడకలుగా మారుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో లేబర్ డిప్యూటీ కమిషనర్ చతుర్వేది, పిఎఫ్ కమిషనర్ సికె.నారాయణ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు యెండల లక్ష్మినారాయణ పాల్గొన్నారు.