నిజామాబాద్

దేశ సంస్కృతిని చూసి గర్వపడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిక్కనూరు, జనవరి 31: భారతదేశంలో పుట్టడం ఒక మంచి అనుభూతని, దేశ సంస్కృతిని చూసి గర్వపడాల్సిన అవసరం ఎంతైన ఉందని కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మంగళవారం మండలంలోని జంగంపల్లిలో గత మూడు రోజులుగా ఇందూరు సాధుపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక సభలకు ఆయన హాజరయ్యారు. మురళికృష్ణ ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రతిరోజు వివిధ ఒత్తిళ్ళతో బాధపడుతున్న వారికి సమ్మేళనాలు ఎంతో దోహదపడతాయన్నారు. దేశ సంస్కృతిని చాటిచెప్పే మహాసభలకు హాజరు కావడం వల్ల మానసిక ఒత్తిడి దూరం అవుతుందన్నారు. భగవంతుని కృప, ఆధ్మాతిక చింతనతో ప్రజల్లో ఎంతో మార్పు వస్తుందన్నారు. ముఖ్యంగా రాష్టస్థ్రాయిలో ఈ సాధుపరిషత్ సభను నిర్వహించడం పట్ల నిర్వాహకులను ఆయన అభినందించారు. అనంతరం మహాసభలకు హాజరైన పీఠాధిపతులు, ఆశ్రమాధిపతులు, సాధులను ప్రభుత్వ విప్ శాలువ కప్పి సత్కరించారు. అనంతరం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ఇందూరు సాధుపరిషత్ అధ్యక్షుడు యోగేశ్వరనంద స్వామి మాతాజీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్‌ను శాలువ కప్పి సత్కారించారు. ఈ కార్యక్రమంలో ఐడిసిఎంస్ చైర్మన్ ముజీబొద్దీన్, జడ్పిటిసి సభ్యులు నంద రమేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాణాల అమృత్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం కన్వీనర్ నర్సింహారెడ్డి, నాయకులు నిట్టు వేణుగోపాల్‌రావు, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు అందె మహేందర్‌రెడ్డి, నాయకులు మద్ది స్వామి, గోపాల్, కమలాకర్, మార్పు రవిందర్‌రెడ్డి, గుండా రాజు, బ్రహ్మాజన ఆశ్రమ కమిటీ అధ్యక్షులు హన్మాగౌడ్, ప్రధాన కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, స్వామి, కృష్ణదాస్, సిద్దిరాములు, హరీశ్‌గోయాంక, తదితరులు పాల్గొన్నారు.