నిజామాబాద్

కన్నుల పండువగా లక్ష్మీనృసింహస్వామి రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందూర్, ఫిబ్రవరి 10: భక్తుల పాలిట కల్పవృక్షమై విరాజిల్లుతున్న ఎడపల్లి మండలం జానకంపేట్ లక్ష్మీనృసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవ వేడుకలు శుక్రవారం కన్నుల పండువగా కొనసాగాయి. ఉదయం వేళలో స్వామివారికి యజ్ఞం, బలిహరణం కార్యక్రమాలను నిర్వహించిన వేదపండితులు, సాయంత్రం స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య అత్యంత వైభవంగా జరిపారు. ఆలయం ముందు భాగంలో రంగురంగుల పూలు, తోరణాలతో అందంగా అలంకరించిన స్వామివారి రథాన్ని భక్తులు లక్ష్మీనృసింహస్వామి గోవిందా గోవిందా అంటూ లాగుతూ భక్తిపారశ్యంలో మునిగితేలారు. స్వామివారి రథోత్సవం పురస్కరించుకుని జానకంపేట్ గ్రామానికి చెందిన పురం అబ్బన్న అనే భక్తుడు మధ్యాహ్నం ఒంటిగంట నుండి సాయంత్రం వరకు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం వేళలో ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతో అలరించగా, అర్ధరాత్రి వరకు భజన పోటీలను నిర్వహించారు. జాతర బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కార్యనిర్వాహణ అధికారి శ్రీరాం రవీందర్, జాతర ఉత్సవాల హడ్‌హక్ కమిటీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌గౌడ్, సర్పంచ్ దశరథ్, రఘు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే ఎడపల్లి ఎస్‌ఐ ఆసీఫ్ నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

ఎస్పీ రక్తదానం

కామారెడ్డి, ఫిబ్రవరి 10: జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన రక్తదాన శిబిరానికి ఎస్పీ శే్వత హాజరయ్యారు. ఈ సందర్భంగా డిపిఓ కార్యాలయంలో ఎస్పీతో పాటు పలువురు పోలీస్ అధికారులు రక్తదానం చేశారు. ఆపదలో ఉన్న రోగులకు రక్తం ఎంతగానో ఉపయోగపడి వారి జీవితాల్లో వెలుగు నింపినట్లు అవుతుందని ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు తిర్మల్‌రెడ్డి, రాజన్న, సిఐలు శ్రీధర్‌కుమార్, కోటేశ్వర్‌రావు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.