నిజామాబాద్

23న నగరంలో డిజి ధన్ మేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, ఫిబ్రవరి 21: నిజామాబాద్ నగరంలోని శ్రీరామా గార్డెన్‌లో ఈ నెల 23న డిజి ధన్ మేళాను నిర్వహిస్తున్నామని, ఇందులో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా కోరారు. మంగళవారం ప్రగతి భవన్‌లో డిజి ధన్‌పై సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. దేశంలో 100రోజుల్లో డిజిటల్ ట్రాన్‌జక్షన్స్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇందులో భాగంగా 100 పట్టణాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. అందులో నిజామాబాద్ జిల్లాకు కూడా చోటు కల్పించడం సంతోషాన్ని కలిగించింది. ఈ మేళాకు విద్యార్థులు, బ్యాంకర్లు, సీనియర్ సిటిజన్లు, వ్యాపారులు, ట్రేడర్లు, అధికారులు హాజరు కావాలన్నారు. డిజి ధన్ మేళా కింద ఖాతాలు లేనివారికి ఈ మేళాలో ఖాతాలు తెరువడం జరుగుతుందని, ఆధార్‌కార్డులో తప్పులు ఉంటే, ప్రజలు ఆ రోజున సరి చేసుకోవచ్చని, ఇందుకోసం 14సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ మేళా నీతి ఆయోగ్ కింద ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు డిజిటల్ ట్రాంజక్షన్‌ను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే విషయాన్ని మేళాలో వివరించడం జరుగుతుందన్నారు. కొంతమంది భీంయాప్, పేటియం లాంటివి ఉండవచ్చని, దీనిపై అవగాహన లేకపోవడం ఎక్కువ మంది ఉపయోగించడం లేదని, అందుకే వీటిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అదే విధంగా వ్యాపారులు, ట్రేడర్ల వద్ద ఈ-నామ్, ఈ-గ్రేవ్, ఈ-ఆసుపత్రుల్లో డిజిటల్ ట్రాంజక్షన్స్‌ను ఏ విధంగా చేయాలో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి బ్యాంకు అధికారులు ఈ డిజెపై ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పటికే గ్రామాల్లో సర్పంచ్‌లు డిజిటల్ ట్రాంజక్షన్స్‌పై కొద్దిగా ప్రచారం చేశారని, 23న జరిగే మేళాలలో మరింత అవగాహన కల్పిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో ఒకరు డిజిటల్ ట్రాంజక్షన్స్‌పై అవగాహన కలిగి ఉండాలన్న ఉద్దేశ్యంతో డిజి ధన్ మేళాను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అర్జున మేగ్వాల్ తదితరులు హాజరవుతారని కలెక్టర్ తెలిపారు. విలేఖరుల సమావేశంలో జెసి రవీందర్‌రెడ్డి, డిఆర్‌ఓ పద్మాకర్ తదితరులు పాల్గొన్నారు.