నిజామాబాద్

రైతులకు అండగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, మార్చి 9: రైతులకు అండగా ఉండి వారి అభివృద్ధికి ఎఇఓలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాబాగౌడ్ ఫంక్షన్‌హాల్‌లో వ్యవసాయశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. రైతులు పంటలు వేసినప్పుడు అధిక దిగుబడులు సాధించే విధంగా అధికారులు సూచనలు అందించాలన్నారు. రైతులకు ఆపద్భాందువులుగా నిలిచి వారి దీవెనలు పొందాలన్నారు. 2వేల హెక్టార్లకు ఒక ఎఇఓ పూర్తిస్థాయిలో రైతుల, పంటల వివరాలను సేకరించాలన్నారు. ప్రతి సీజన్‌లో రైతులు ఏ పంట వేస్తున్నారో దిగుబడి, తదితర సూచనలను అందించాలన్నారు. పంట నష్టం జరిగితే వాటి వివరాలను సేకరించి సంబంధిత అధికారులకు అందించాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రైతుల అభివృద్ధికి వ్యవసాయశాఖ అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.

ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు సుధాకర్

కామారెడ్డి టౌన్, మార్చి 9: టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు జులూరి సుధాకర్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వస్తే నిరుద్యోగులతో పాటు అందరి బతుకులు బాగుపడుతాయని అనుకున్న వారి కలలు నిజం కావడం లేదన్నారు. డిఎస్సీని వెంటనే ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. అనంతరం బిజెవైఎం నూతన కార్యవర్గాన్ని వెల్లడించారు. బిజెవైఎం ఉపాధ్యక్షులుగా వి.కె సింగ్, ప్రధాన కార్యదర్శులుగా సదాశివరెడ్డి, రవికుమార్, కృష్ణపటేల్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బండారి నరేందర్‌రెడ్డి, రైతు సేవా ఆర్గనైజర్‌గా తిరుపతిరెడ్డిలను ఎన్నుకున్నట్లు తెలిపారు.