నిజామాబాద్

తెయు విసి దిష్టిబొమ్మ దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, మార్చి 11: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ వార్షిక పరీక్షలను వాయిదా వేయాలనే అభ్యర్థనను తిరస్కరించడాన్ని నిరసిస్తూ ఎబివిపి ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద తెయు వైస్ ఛాన్స్‌లర్ సాంబయ్య దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ నెల 16నుండి నిర్వహించదల్చిన డిగ్రీ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎబివిపి నగర కార్యదర్శి గూండ్ల రంజిత్ మాట్లాడుతూ ఈ నెల 16 నుండి పరీక్షలను నిర్వహిస్తే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతం డిగ్రీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కొనసాగుతున్నాయని, ఇవి ఈ నెల 14వ తేదీ వరకు నిర్వహిస్తారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి 16వ తేదీ నుండి వార్షిక పరీక్షలు నిర్వహిస్తే పరీక్షలకు విద్యార్థులు పూర్తిస్థాయిలో సన్నద్ధం అయ్యేందుకు సరైన వ్యవధి లేకుండాపోతుందని ఆందోళన వెలిబుచ్చారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కనీసం పక్షం రోజుల పాటు పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తెలంగాణ యూనివర్శిటీని వేయి మందితో ముట్టడిస్తామని హెచ్చరించారు. బంగారు తెలంగాణకు కావాల్సింది విద్యార్థుల బంగారు భవితవ్యమేననే విషయాన్ని పట్టించుకోకుండా ప్రాక్టికల్స్ ముగిసిన వెంటనే పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి నాయకులు సాయికుమార్, మనోజ్, సంతోష్, గంగాప్రసాద్, బలరాం తదితరులు పాల్గొన్నారు.

కెనాల్ వద్ద పసికందు
మాక్లూర్, మార్చి 11: ఆడపిల్లగా పుట్టడమే ఆ పాప చేసిన నేరమా?, లేక కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఆడపిల్లను పోషించలేకనో అభంశుభం ఎరుగని పసికందును వదిలేసి వెళ్లిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. మాక్లూర్ మండలం దాస్‌నగర్ సమీపంలోని శ్రీచంద్ర టెక్నో స్కూల్ సమీపంలో కెనాల్ ప్రక్కన తల్లిపాల కోసం బిగపట్టి ఏడుస్తున్న పసికందును స్కూల్ యాజమాన్యం గుర్తించారు. వెంటనే అక్కడి వెళ్లి చూడగా, చిరిగిన బట్టల్లో ముదిరి కాల్వ ప్రక్కన ఏడుస్తున్న ఆ చిన్నారిని చేరదీశారు. సాయంత్రం వరకు కూడా ఆ పాప కోసం ఎవరు రాకపోవడంతో స్కూల్ యాజమాన్యం మాక్లూర్ ఎస్‌ఐ రామానాయుడుకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న మాక్లూర్ ఎస్‌ఐ, వెంటనే ఐసిడిఎస్ అధికారులకు విషయాన్ని తెలియజేశారు. పాపను హుటాహుటిన చికిత్స నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రిలోని పిల్లల విభాగానికి తరలించారు. దీంతో ఆసుపత్రిలోని పిల్లల వైద్యుడు డాక్టర్ దీపక్ రాథోడ్ పసిపాపను పరీక్షించిన అనంతరం పాప ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. అయితే శిశు గృహ మేనేజర్ అనితతో పాటు ఆయాలు పిల్లల వైద్యుడి సూచనల మేరకు నాలుగు రోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్స అందించే విధంగా చూస్తామన్నారు.