నిజామాబాద్

విద్యుదాఘాతంతో నలుగురికి తీవ్ర గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్కొండ, మార్చి 11: మెండోరా మండల కేంద్రం నుండి సావెల్ సబ్ స్టేషన్‌కు 33/11కెవి విద్యుత్ లైన్ కోసం నిర్మాణం పనులు చేపడుతుండగా, మెండోరా-కొడిచెర్ల గ్రామాల మధ్య విద్యుత్ లైన్లు తెగిపడి నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. శనివారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మెండోరా నుండి సావెల్ సబ్ స్టేషన్‌కు కొత్తగా విద్యుత్ లైన్ వేస్తున్నారు. అయితే మెండోరా గ్రామ శివారులో 33/11కెవి విద్యుత్ వైర్లను కూలీలు సరి చేస్తున్న సమయంలో ఊడిపోయి వాటి కింద ఉన్న వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ను సరఫరా చేసే స్తంభాలపై పడ్డాయి. అదే సమయంలో విద్యుత్ లైన్ నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్న గుంటూరుకు చెందిన నలుగురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురికి కాళ్లు, చేతులకు కాలిన గాయలవగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురిని జిల్లా ఆసుపత్రికి తరలించగా, తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. వైర్లు బిగుస్తున్న సమయంలో కాంట్రాక్టర్, సంబంధిత శాఖ ఎ.ఇలు ఎవరూ కూడా లేకపోవడంతో కేవలం హెల్పర్లు మాత్రమే పనులు చేపట్టడం వల్ల ఈ ప్రమాద సంఘటన జరిగిందని బాధితుల కుటుంబ సభ్యులు ఆక్షేపించారు. ఈ విషయమై ట్రాన్స్‌కో అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా, అందుబాటులో లేకుండాపోయారు.

కేంద్రీయ విద్యాలయంలో నాణ్యమైన విద్యాబోధన
కలెక్టర్ సత్యనారాయణ
నిజాంసాగర్, మార్చి 11: కేంద్రీయ విద్యాలయమైన అచ్చంపేట్ జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థులకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యాబోధన అందించడం జరుగుతోందని, కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యనారాయణ అన్నారు. శనివారం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ జెఎన్‌విలో విద్యార్థులు, వారి తల్లితండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మీ పిల్లలు మా పిల్లలే అని కలెక్టర్ వారీకి ధీమా ఇచ్చారు. మీ పిల్లలకు ఇంటివద్ద మీ పర్యవేక్షణ కంటే, విద్యాలయంలోఉపాధ్యాయుల పర్యవేక్షణలో నాణ్యమైన విద్యాబోధన అందించడం జరుగుతోందన్నారు. విద్యార్థులు కేంద్రీయ విద్యాలయాల్లో చదువుకుంటే అన్ని ప్రాంతాల విద్యార్థులు పరిచయం అవుతూ, వారి ఆలోచన సరళిని పెంపొందించుకుని, ఉన్నత ఆశయాలతో మంచిగా చదువుకుంటారని అన్నారు. విద్యార్థులు ఉన్నత స్థానానికి చేరేందుకు పట్టుదలతో చదివి తల్లితండ్రులకు విద్యాలయానికి మంచిపేరు తేవాలని సూచించారు. విద్యాలయంలో సిసి కెమెరాల ఏర్పాటుకోసం కృషి చేస్తామన్నారు. అంతకు ముందు కలెక్టర్ సహాయ నిధి నుంచి మంజూరు చేసిన లక్షా 20 వేల రూపాయలతో కొనుగోలు చేసి ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. నీటిని తాగి సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట బాన్స్‌వాడ ఆర్డీఓ రాజేశ్వర్, ఎంపిడిఓ రాములు నాయక్, గిర్ధావర్ సయ్యద్ హుసెన్, జెఎన్‌వి ప్రిన్స్‌పాల్ శేఖర్‌బాబు, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.