నిజామాబాద్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిక్కనూరు, మార్చి 19: భిక్కనూరు రైల్వే స్టేషన్ గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈసంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన చంద్రంగౌడ్ (39), రంగా మల్లాగౌడ్ (38) లు బైక్ పై అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ విందుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. భిక్కనూర్ రైల్వే స్టేషన్ చౌరస్తా లోని జిబిఆర్ ఫంక్షన్ హాలుకు వెళ్తుండగా యు టర్న్ తీసుకుంటుండగా కారు ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు చంద్రంగౌడ్ , మల్లాగౌడ్‌లు తిప్పాపూర్‌లో కల్లుగీత కార్మికులుగా పనిచేస్తున్నారు. ఆదివారం వారి అంత్యక్రియలు గ్రామంలో నిర్వహించారు. తిప్పాపూర్ గ్రామంలో ఇద్దరి మృతితో విషాదఛాయలు నెలకొన్నాయి. చంద్రంగౌడ్‌కు భార్య నాగలత, కుమారుడు మనోజ్, కుమార్తె మానసలు ఉన్నారు. అలాగే మల్లాగౌడ్‌కు భార్య లత ,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

నివేదికల పేరుతో నష్టపరిహారంలో జాప్యం తగదు
తక్షణ సహాయంతోనే రైతులకు ఊరట
మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి

మాక్లూర్, మార్చి 19: వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే విషయంలో జాప్యం చేయవద్దని మాజీ స్పీకర్ కెఆర్.సురేష్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గత ఏడాది కురిసిన భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి అత్యధిక మంది రైతులు అప్పులు చేసి మరీ పంటలు సాగు చేశారని అన్నారు. తీరా పంట చేతికందే దశకు చేరుకున్న తరుణంలో అకాల వర్షాలు కురిసి పంటను కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టంపై సమగ్ర సర్వే జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడంలో తహశీల్దార్లు చురుకుగా వ్యవహరించాలని సూచించారు. ఆదివారం ఆయన మాక్లూర్ మండలంలోని మాదాపూర్, ముల్లంగి, బొంకన్‌పల్లి, గొట్టిముక్కల, మెటుపల్లి, వల్బాపూర్, చిక్లి, గుంజిలి, కొత్తపల్లి గ్రామాల్లో పర్యటించి వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను పరామర్శించారు. అధైర్యపడవద్దని తాము అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. తనకు ఉన్న పలుకుబడితో ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, రైతులు చేతిలో చిల్లిగవ్వ కూడా మిగుల్చుకోకుండా పెట్టుబడలన్నీ పంటల సాగుకే వెచ్చించారని అన్నారు. అయితే ప్రస్తుతం ప్రకృతి వైపరీత్యం వల్ల పంట మొత్తం కోల్పోయిన రైతులు తీవ్రంగా తల్లడిల్లుతున్నారని అన్నారు. ప్రభుత్వం బాధిత రైతుల పరిస్థితిని గమనించి ఎకరానికి కనీసం 30వేల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలన్నారు. వడగళ్ల వాన నష్టపరిహారం నామమాత్రంగానే ఉంటోందని, దీనిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పరిహారం ఇచ్చే విషయంలో జాప్యం చేస్తే రైతులు ఆత్మస్థైర్యం కోల్పోయి బలవన్మరణాలకు పాల్పడే అవకాశాలు సైతం ఉన్నందున అన్నదాతను ఆదుకునేందుకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు. నివేదికల పేరుతో జాప్యం చేయకూడదని సూచించారు. సురేష్‌రెడ్డి వెంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకుడు కె.లింగారావు, దయాకర్‌రావు, రమేష్‌నాయక్, రాజు, పి.ఇంద్రుడు, ముత్యం తదితరులు పాల్గొన్నారు.