నిజామాబాద్

వీడిన కళాశాల వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, మార్చి 23: కామారెడ్డి ప్రభుత్వ కళాశాల ఆస్తుల వివాదం ఎట్టకేలకు వీడింది. 1964లో కామారెడ్డికి చెందిన పలువురు పెద్దలు అప్పటి కలెక్టర్ రామన్ ఆధ్వర్యంలో కళాశాల ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. 268ఎకరాల 4గుంటల భూమిని సేకరించి ప్రత్యేక కోర్సులతో బోధనను కొనసాగిస్తున్నారు. కొద్ది సంవత్సరాల క్రితం నియమకాల్లో అక్రమాలు చోటు చేసుకోవడంతో కళాశాల ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తు విద్యార్థి సంఘాల నాయకులు ఉద్యమాలు నిర్వహించగా పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో 1987లో ప్రభుత్వం కళాశాలను స్వాధీనం చేసుకోగా, సభ్యులు కోర్టుకు వెల్లడంతో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అప్పటి నుండి విద్యార్థి సంఘాలు, జెఎసి, రాజకీయ పార్టీల నాయకులు ఉద్యమాలు నిర్వహిస్తునే ఉన్నారు. గత రెండు పర్యాయాలుగా జెఎసి, విద్యార్థి సంఘాలు అమరణ నిరాహార దీక్ష చేపట్టాయి. హరితహారంలో భాగంగా సిఎం కెసిఆర్ కామారెడ్డి డిగ్రీ కళాశాల ఆవరణలో సభ ఏర్పాటు చేసినప్పుడు ఆస్తులకు సంబంధించి వివాదంపై సిఎం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో కళాశాలను అభివృద్ధి చేస్తానని, ఆస్తుల స్వాధీనం కూడా త్వరలోనే చేపడతామని అప్పట్లో సిఎం ప్రకటించారు. డిగ్రీ కళాశాలలో ఆరు నెలల క్రితం అల్యూమిని ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి హాజరై సమస్యను పరిష్కరిస్తానని హమీ ఇచ్చారు. కళాశాల ఆస్తుల వివాదం గత 3నెలలుగా వెడెక్కింది. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రెండు పర్యాయలు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, సంబంధిత శాఖ మంత్రి జరిగిన కళాశాల ఆస్తుల పరిరక్షణ సమావేశంలో కూడా పాల్గొని సమస్యను పరిష్కరించేందుకు దృష్టి సారించారు. కళాశాల ఆస్తుల వివాదం సిఎం కెసిఆర్, డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్దన్, శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీతో పాటు జెఎసి, అల్యూమిని ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, పూర్వ విద్యార్థులు, జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. దీంట్లో భాగంగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం కళాశాల ఆస్తులను రిజిస్ట్రేషన్ చేశారు. ఎట్టకేలకు వివాదం సద్దుమణగడంతో ఇకపై కళాశాల అభివృద్ధికి దృష్టి సారించనున్నారు. న్యాక్ గుర్తింపుతో ప్రత్యేక నిధులు రావడంతో కళాశాల అభివృద్ధి చెంది పూర్వ వైభవం నెలకొంటుందని పూర్వ విద్యార్థులు తెలిపారు. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ బుధవారం విలేఖరుల సమావేశంలో 148 ఎకరాల 9 గంటలు కళాశాల పేరిట రిజిస్ట్రేషన్ జరిగినట్లు వెల్లడించడంతో విద్యార్థి సంఘాల నాయకులు అమరణ నిరాహార దీక్షను విరమించారు.