నిజామాబాద్

నిలువునా ఎండుతున్న శనగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జుక్కల్, డిసెంబర్ 19: జుక్కల్ మండలంలో రైతులు రబీలో సాగు చేసిన సెనగ వర్షాభావ పరిస్థితుల కారణంగా నీరులేక నిలువునా ఎండిపోతోంది. గడిచిన నెల రోజులుగా వేసవిని తలపించే విధంగా ఎండలు కాస్తుండటం, మంచు కురియకపోవడంతో, చలి వాతావరణం లేకపోవడంతో రబీ పైర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం 50శాతం సబ్సిడీపై సెనగ విత్తనాలను పంపిణీ చేసినందున ఈసారి రైతులు పోటీ పడుతూ ఎక్కువ విస్తీర్ణంలో సెనగను వేశారు. వర్షం కురియకపోతుందా అనే ఆశతో రైతన్నలు సెనగను సాగు చేయగా, రబీ ప్రారంభంలోనే గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. మండలంలో సబ్సిడీ విత్తనాలు సరఫరా చేసినందున 20వేలకు పైగా ఎకరాల్లో రైతులు సెనగ పంటను సాగు చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. సెనగలు విత్తిన నాటి నుండి ఎలాంటి వర్షం కురియకపోవడంతో మెజార్టీ గ్రామాల్లోని శివార్లలో సెనగ పైర్లు వాడి ఎండిపోతున్నాయి. ఖరీఫ్‌లో సాగు చేసిన పెసర, పత్తి, మినుము, కంది పంటలు పూర్తిగా ఎండిపోయి నష్టపోయి కోలుకోలేని స్థితిలో ఉన్న రైతులకు, రబీలో వేసిన సెనగ కూడా ఎండిపోవడంతో రైతులు మరిన్ని అప్పుల్లో కూరుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గొట్టబావుల ద్వారా నీటిని మళ్లించడంతో అక్కడక్కడా కొద్ది శాతం మాత్రమే సెనగ పైర్లు పచ్చగా కనిపిస్తున్నాయి. కానీ, ఎలాంటి నీటి సౌకర్యం లేకుండా సాగు చేసిన 80శాతం రైతులు మాత్రం పూర్తిగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత రబీలో సెనగ పైర్లకు కౌలాస్‌నాలా నీటిని విడుదల చేయగా, ఈసారి కూడా విడుదల చేస్తారని రైతులు భావించారు. అయితే కౌలాస్‌నాలా నీటి నిల్వలు తగ్గిపోయి ప్రస్తుతం డెడ్‌స్టోరేజీకి చేరుకోవడంతో నీటిని విడుదల చేయలేకపోయారు. దీంతో ప్రాజెక్టు ఆయకట్టు గ్రామాలైన కౌలాస్, ఖండేబల్లూర్, మహ్మదాబాద్, లాడేగాం, కేంరాజ్‌కల్లాలి తదితర గ్రామ శివార్లలో సెనగ పైర్లు పూర్తిగా ఎండిపోతున్నాయి. పంటలు సమృద్ధిగా పండుతాయనే ఉద్దేశంతో కౌలు రైతులు పోటీపడి సాగు భూములను కౌలుకు తీసుకుని పంటలు సాగు చేశారు. ఎకరానికి 20వేల చొప్పున కౌలు చేయగా, పంటల సాగుకు అదనంగా ఒకో ఎకరానికి 5నుండి 10వేల రూపాయల వరకు ఖర్చు చేశారు. దీంతో భూ యజమానులు కౌలు డబ్బులు వసూలు చేసేందుకు కౌలు రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. పంటల పరిస్థితి పూర్తిగా నిరాశజనకంగా ఉండటంతో కౌలురైతులు తప్పించుకుని తిరగాల్సిన దుస్థితి నెలకొంది.