నిజామాబాద్

మతపరమైన ఘర్షణలకు తెరలేపుతున్న సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, ఏప్రిల్ 16: ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి ముఖ్యమంత్రి కెసిఆర్ మతపరమైన ఘర్షణలకు తెరలేపాడని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్ చెప్పారు. ఆదివారం ఆయన ఆర్మూర్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. మతపరమైన ఘర్షణలు సృష్టించి రాబోయే ఎన్నికల్లో కెసిఆర్ లాభపడదామని కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో తండ్రి, కొడుకులకు బుద్ధి చెప్పినట్లుగానే రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా కెసిఆర్ కుటుంబానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు. మోసపూరిత మాటలతో మభ్యపెట్టే రోజులకు కాలం చెల్లాయని అన్నారు. కేవలం ముస్లింలకు సంతోషపర్చడం కోసమే మతం పేర రిజర్వేషన్లు తేవడాన్ని బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన చెప్పారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కెసిఆర్ కుటిల రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగపరంగా అమలుకాదని తెలిసి ముస్లింలను మభ్యపెట్టడానికి యత్నించడం బాధాకరమని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లను జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేకిస్తుందని అన్నారు.
ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న టిఆర్‌ఎస్
బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి
రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు తీసుకురావడం ద్వారా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నట్లు స్పష్టం అవుతోందని బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి అన్నారు. మతపరమైన రిజర్వేషన్లతో దేశానికి నష్టం వాటిల్లుతుందని అన్నారు. గతంలో ఎన్నోసార్లు వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయన్నారు. కేవలం ముస్లింలను మభ్యపెట్టడానికే 12 శాతం రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారని చెప్పారు. టిఆర్‌ఎస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ వాగ్ధానాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని అన్నారు. గతంలో కాంగ్రెస్ ముస్లింలకు కల్పించిన 4 శాతం రిజర్వేషన్ అంశంపై కోర్టులో పెండింగ్‌లో ఉన్న సందర్భంలో మళ్లీ టిఆర్‌ఎస్ ప్రభుత్వం 12 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని బిల్లు పెట్టడం సరికాదని అన్నారు. ఇలాంటి రిజర్వేషన్ల వల్ల విద్యా, ఉద్యోగ రంగాల్లో బిసిలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఇలాంటి మతపరమైన రిజర్వేషన్లను బిజెపి వ్యతిరేకిస్తుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా బిజెపి నాయకులను అర్ధరాత్రి సమయంలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించి నిర్బంధించడం సరికాదని అన్నారు. సెల్‌ఫోన్లు సైతం లాక్కున్నారని అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం రాబోయో రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్, నాయకులు ద్యాగ ఉదయ్, జెస్సు అనిల్, ఆకుల రాజు, పూజ నరేందర్, పోల్కం వేణు, కోలు చంద్రశేఖర్, మందుల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.