నిజామాబాద్

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, ఏప్రిల్ 20: జిల్లాలో నేటి నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కలెక్టర్ సత్యనారాయణ ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సంబంధిత అధికారుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం గురించి అధికారులకు వివరించారు. ఈనెల 22వ తేదిన పార్శిరాములు కల్యాణ మండపంలో పెంపకపుదారులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు. వ్యవసాయశాఖ నుండి మంజూరైన 4వ విడత ఇన్‌పుడ్ సబ్సిడిని కూడా అధికారులకు తెలియచేశారు. ఎన్‌ఎంఎస్‌ఎ కింద మంజూరైన గేదేలను ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు గజరాం, శేఖర్, తదితరులున్నారు.

మతపరమైన రిజర్వేషన్ల బిల్లు రాజ్యాంగ విరుద్ధం

బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు లక్ష్మీనారాయణ
వినాయక్‌నగర్, ఏప్రిల్ 20: మతపరమైన రిజర్వేషన్ల బిల్లు రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధమని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ ఆక్షేపించారు. ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం నిజామాబాద్ తహశీల్ కార్యాలయం ఎదుట బిజెపి నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా యెండల మాట్లాడుతూ, రాజ్యాంగ నిబంధనలను కాలరాస్తూ తెరాస సర్కార్ ముస్లింలకు రిజర్వేషన్లు పెంచే బిల్లును అసెంబ్లీలో ఆమోదించడం కేవలం రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసమేనని దుయ్యబట్టారు. తక్షణమే దీనిని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో తెరాస ప్రభుత్వం ప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పదని హెచ్చరించారు. ముస్లిం రిజర్వేషన్ల కారణంగా బిసిలు, ప్రత్యేకించి హిందువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, వారికి ఎనలేని రీతిలో అన్యాయం జరుగుతుందన్నారు. రిజర్వేషన్ల ఫలితంగా ముస్లింలకు ఉన్నత విద్యతో పాటు ఉద్యోగాలు సులభంగా లభిస్తాయని, బిసిలు, హిందువులు నష్టపోయే ప్రమాదం ఉంటుందన్నారు. మతపరమైన రిజర్వేషన్లతో విద్రోహ శక్తులను పెంచి పోషిస్తున్న తెరాస ప్రభుత్వానికి యావత్ తెలంగాణ ప్రజానీకం గట్టిగా గుణపాఠం చెప్పాలని బిజెపి నేత ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. ధర్నా అనంతరం తహశీల్దార్ సుదర్శన్‌కు మెమోరాండం అందజేశారు. ఈ ధర్నాలో బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, బిజెవైఎం నగర అధ్యయుడు న్యాలం రాజు, రోషన్‌లాల్ బొహ్రా తదితరులు పాల్గొన్నారు.