నిజామాబాద్

అభివృద్ధి పనులకు 2.36 కోట్లు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, ఏప్రిల్ 20: కామారెడ్డి అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు గాను 2కోట్ల 36లక్షల 76వేల నిధులు మంజూరైనట్లు ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ తెలిపారు. గురువారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. నూతనంగా అదనపు గదుల నిర్మాణంతో పాటు గదుల మరమ్మత్తులకు, బిటి రోడ్డు మరమ్మత్‌లకు నిధులు మంజూరైనట్లు తెలిపారు. దోమకొండ మండలంలోని అంబారీపేట్‌లోని హైస్కూల్‌కు 4 అదనపు గదుల నిర్మాణానికి 29.60 లక్షలు, బస్వాపూర్‌లో 4 అదనపు గదులకు 22.60 లక్షలు, భిక్కనూరులో ఒక అదనపు గదికి 7.40 లక్షలు, రాజంపేట్ పాఠశాలలోని 3గదుల మరమ్మత్తులకు 4.50 లక్షలు, మందాపూర్ 5గదుల మరమ్మత్‌లకు 7.50 లక్షలు, యడారం 4గదుల నిర్మాణానికి 4లక్షలు, దోమకొండలోని హైస్కూల్‌లో అదనపు గది నిర్మాణానికి 7.40లక్షలు, కామారెడ్డిలోని బాలుర ఉన్నత పాఠశాలలోని 19గదుల మరమ్మతులకు 28.50లక్షలు, గంజ్ పాఠశాల 2గదుల మరమ్మతులు 3లక్షలు, గర్గుల్ 3అదనపు గదుల నిర్మాణానికి 22.20లక్షలు, ఫరీదీపేట్ 2 గదుల మరమ్మతులకు 3లక్షలు, చుక్కాపూర్‌లో 3గదుల నిర్మాణానికి 4.50లక్షలు, మొత్తం 13అదనపు గదులకు 96లక్షల 20వేలు, 46గదుల మరమ్మత్తులకు 69లక్షలు సర్వశిక్ష అభియాన్ కింద సంబంధిత మంత్రి కడియం శ్రీహరి నిధులు మంజూరు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సౌత్ క్యాంపస్ నుండి దోమకొండ వరకు 8కిలోమీటర్ల బిటి రోడ్డు రినివల్‌కు 71లక్షల 50వేలు మంత్రి తుమ్మల నాగేశ్వర్ మంజూరు చేశారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జడ్పిటిసి సభ్యులు నంద రమేశ్, మదుసుధన్‌రావు, టిఆర్‌ఎస్ నాయకులు నిట్టు వేణుగోపాల్‌రావు, జుకంటి మోహన్‌రెడ్డి, పిప్పిరి ఆంజనేయులు, కుంచాల శేఖర్, అమృత్‌రెడ్డి, గౌరి శంకర్, మామిండ్ల రమేశ్, బల్వంత్‌రావు, గణేశ్, నర్సారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, గరిగెంటి లక్ష్మీనారాయణ, తదితరులున్నారు.

దళారులకు పంట అమ్మి మోసపోవద్దు
జెసి రవీందర్‌రెడ్డి
మోర్తాడ్, ఏప్రిల్ 20: రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకే ప్రభుత్వం గ్రామాలలో విరివిగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి సూచించారు. గురువారం మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామంలోని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ, చాలా వరకు రైతులు గ్రామాలలో వ్యాపారులకు పంట అమ్ముకుంటుంటారని దీనివల్ల ఇబ్బందులు ఏర్పడుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు. గిట్టుబాటు ధర పొందాలంటే కొనుగోలు కేంద్రాల వినియోగమే సరైన పద్ధతి అని సూచించారు. వ్యాపారులకు, మధ్య దళారీలకు పంట అమ్ముకోవడం వల్ల రైతులు అనేక రకాలుగా నష్టపోతారని అన్నారు. గిట్టుబాటు ధర రాకపోగా, అసలు డబ్బులు వస్తాయో లేదో తెలియదని అన్నారు. అందువల్ల అన్ని ప్రాంతాల్లోనూ రైతులు ప్రభుత్వపరంగా నెలకొల్పిన కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలని హితవు పలికారు. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి ఇబ్బందులు పడవద్దని సూచించారు. తామంతా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే ధాన్యాన్ని తరలించాలని ముందస్తుగానే నిర్ణయం తీసుకున్నామని, ఎవరు కూడా ప్రైవేటు వ్యాపారులకు అమ్మవద్దని నిర్ణయించుకున్నామని రైతులు తెలుపగా, జెసి దొన్కల్ రైతులను అభినందించారు. కేంద్రంలో పూర్తిగా పర్యటించిన జెసి రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు పలు సూచనలు చేసారు. ధాన్యాన్ని తెచ్చిన రైతుల వివరాలను పూర్తి స్థాయిలో నమోదు చేయాలని 48గంటల వ్యవధిలోవారి బ్యాంకు ఖాతాలలో డబ్బులను జమ చేస్తామని అన్నారు. జిల్లాలో ఈసారి ధాన్యం దిగుబడులు ఎక్కువగా వచ్చినందున, అందుకు అణుగుణంగా జిల్లా వ్యాప్తంగా 240కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసామని అన్నారు. దొన్కల్‌తో పాటు సమీప గ్రామాలలో రైతులకు అవగాహన కల్పించి వారందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలలోనే ధాన్యాన్ని విక్రయించేలా చర్యలు చేపట్టాలని సిబ్బందిని, అధికారులను ఆదేశించారు. జెసి వెంట ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనాథ్, స్థానిక తహసిల్దార్ సూర్యప్రకాష్. డిటి ఎన్‌ఫోర్స్‌మెంట్ విజయలక్ష్మీ, ఆర్‌ఐ రమేశ్‌బాబుతోపాటు రెవెన్యు సిబ్బంది, రైతులు ఉన్నారు.