నిజామాబాద్

5 నుండి మన తెలంగాణ - మన వ్యవసాయ సదస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, ఏప్రిల్ 27: వ్యవసాయశాఖ అధికారుల ఆదేశాల మేరకు మే 5నుండి 16వ తేది వరకు మన తెలంగాణ - మన వ్యవసాయ సదస్సులను నిర్వహించనున్నట్లు కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. గురువారం జనహిత భవనంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ప్రగతి నివేదికలతో హాజరై అభివృద్ధి అంశాలపై దృష్టి సారించాలన్నారు. వ్యవసాయాన్ని అభివృద్ధి పర్చి రైతులకు అండగా నిలవడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. దీంట్లో భాగంగానే మన వ్యవసాయం అనే అంశంపై అందరికి అవగాహన కోసం సదస్సులను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ మణిమాల, డిఎస్‌ఓ గంగాధర్, అర్టికల్చర్ అధికారి శేఖర్, తదితరులు పాల్గొన్నారు.