నిజామాబాద్

కెసిఆర్‌కు యువత, విద్యార్థులే తగిన గుణపాఠం చెబుతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి రూరల్, ఏప్రిల్ 28: సిఎం కెసిఆర్‌కు విద్యార్థులు, యువత తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ అన్నారు. శుక్రవారం మండలంలోని దేవునిపల్లి గ్రామంలో 2.50లక్షల రూపాయలతో అదనపు మసీద్ ప్రాంగణాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సదంర్భంగాఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కెసిఆర్ కుటుంబ పాలనకు యువత చరమగీతం పాడాలన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేయడం ఆయన విఘ్నతకే వదిలేస్తున్నామన్నారు. విద్యారంగంలో రాష్ట్రం 29వ స్థానంలో నిలవడం బాధకరమన్నారు. గత మూడు సంవత్సరాల కాలంలో తెరాస ప్రభుత్వం చేసిందేమిలేదన్నారు. యువకల ఆత్మబలిదానాలు, ఉద్యమాలతో తెలంగాణ కోసం సోనియాగాంధీ పార్లమెంట్‌లో బిల్లు ఆమోదించారని గుర్తు చేశారు. కెసిఆర్ వ్యతిరేక విధానాలపై యువత ఉద్యమించాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన యువకులకు ఆయన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గూడెం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపిటిసి నిమ్మ విజయ్‌కుమార్‌రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉరుదొండ నరేశ్, గ్రామ అధ్యక్షులు మదుసుధన్, కౌన్సిలర్లు, నాయకులు నర్సింలు, రాంమోహన్, నరుూం, నిట్టు వేణుగోపాల్‌గౌడ్, మామిండ్ల అంజయ్య, జమునరాథోడ్, నల్లవెల్లి అశోక్, నీలం వెంకటి, పెద్దనారాయణ, భూమని బాల్‌రాజు పాల్గొన్నారు.

శ్రీరాంసాగర్‌లో చేపలు మృతి
బాల్కొండ, ఏప్రిల్ 28: రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టుల్లో ఒకటైనా నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్‌లో చేపలు మృత్యువాత పడుతున్నాయి. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు 90టిఎంసిలు కాగా, శుక్రవారం సాయంత్రానికి 1058.90 అడుగుల వద్ద నిల్వ ఉంది. ప్రాజెక్టు నీటిమట్టం గణనీయంగా పడిపోతుండటం, దీనికి తోడు ఎండలు ఎక్కువగా కాయడం, నీరు వేడెక్కుతుండటం, రిజర్వాయర్‌లోని నీరు కలుషితం అవుతుండటంతో చేపలు మృత్యువాత పడుతున్నాయని మత్స్యకారులు తెలిపారు. గడిచిన కొద్ది రోజులుగా వేల సంఖ్యలో చేపలు చనిపోతుయి నీటిలో తేలియాడుతున్నాయని, దీనిపై మత్స్య శాఖ అధికారులకు సమాచారం అందించామని మత్స్యకారులు తెలిపారు. రబీ పంట చేతికి వస్తున్నందున ప్రాజెక్టు నుండి నీటి విడుదలను నిలిపివేసి, చేపలను కాపాడాలని మత్స్యకారులు కోరుతున్నారు.