నిజామాబాద్

తనిఖీలకు శ్రీకారం చుట్టిన రవాణా ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 14: వేసవి సెలవులు ముగిసి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం అధికారులు తనిఖీలకు శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని ముఖ్య పట్టణాల్లోనూ స్కూల్ బస్సులను లక్ష్యంగా చేసుకుని ఎక్కడికక్కడ తనిఖీల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్‌తో పాటు ఆర్మూర్, బోధన్ పట్టణాల్లో ఎనిమిది స్కూల్ బస్సుల నిర్వహణ సక్రమంగా లేదని గుర్తించి కేసులు నమోదు చేశారు. ప్రతిఏటా పాఠశాలలు కొనసాగే సమయంలో స్కూల్ బస్‌ల నిర్వహణకు సంబంధించి లోపాలు తెరపైకి వస్తూ అడపాదడపా ప్రమాద సంఘటనలు చోటుచేసుకుంటున్న విషయం విదితమే. కండీషన్‌లో లేని వాహనాలను స్కూల్ బస్‌లుగా వినియోగిస్తుండడం వల్లే ఈ తరహా ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సుల నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. వేసవి సెలవులు ముగియకముందే పాఠశాలల యాజమాన్యాలు స్కూల్ బస్‌ల ఫిట్‌నెస్‌ను ధ్రువీకరించుకోవాలని గడువు విధించారు. ఈ మేరకు మెజార్టీ పాఠశాలలకు చెందిన యాజమాన్యాలు తమ స్కూల్ బస్సులు, ఇతర వాహనాలను ఫిట్‌నెస్ చేయించుకుని ధ్రువీకరణ పత్రాలు పొందారు. అయితే మరికొన్ని పాఠశాలలకు చెందిన బస్సులు కాలం చెల్లినవై కండీషన్ సరిగా లేనందున వాటికి ఫిట్‌నెస్‌లు చేయించలేదు.

బంజారా మహాసభ విజయవంతానికి పిలుపు
* రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
కంఠేశ్వర్, జూన్ 14: నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలం గన్నారంలో ఈ నెల 15న తెలంగాణ సేవాలాల్ పూజారుల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంజార మహాసభకు గిరిజనులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని రూరల్ శాసన సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహాంలో బంజార సేవా సంఘం నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బాజిరెడ్డి మాట్లాడారు. గిరిజనుల సంక్షేమం కోసం ఈ నెల 13న జగద్గురు రామారావు మహరాజ్ శ్రీ చైతన్య రథయాత్ర రాజనాయక్ ఆధ్వర్యంలో దండిగల్ తండా బహుదూర్‌పల్లి మండలంలో ప్రారంభమైందన్నారు. ఈ చైతన్య రథయాత్ర గురువారం నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలం గన్నారంకు చేరుకుంటుందన్నారు. జగద్గురు రామారావు మహరాజ్ చైతన్య రథయాత్రకు మండలంలోని చంద్రయాన్‌పల్లి వద్ద ఘన స్వాగతం పలుకడం జరుగుతుందని, అందువల్ల గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. విలేఖరుల సమావేశంలో శివరాజ్ మహరాజ్, ఈశ్వర్ మహరాజ్, పరుశురాం మహరాజ్, నారాయణ మహరాజ్, జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షుడు గడీల శ్రీరాములు, వసంత్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

20న మంత్రి చేతుల మీదుగా ఆరోగ్యశ్రీ ప్రారంభం
కంఠేశ్వర్, జూన్ 14: నగరంలోని తిరుమల మల్టీస్పెషల్ సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రిలో ఈ నెల 20న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతుల మీదుగా ఆరోగ్యశ్రీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ పరమేశ్వర్‌రెడ్డి తెలిపారు. బుధవారం నగరంలోని తిరుమల ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తమ ఆసుపత్రి ఆరోగ్యశ్రీ సేవలు అందించేందుకు అనుమతి మంజూరీ చేసిందని, అందుకు ముఖ్యమంత్రి కెసిఆర్, ఎంపి కవితకు కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం 14విభాగాలను మంజూరీ చేసిందన్నారు. జనరల్ సర్జరీ, ఆబ్‌స్టిరిక్ అండ్ గైనాకాలజిస్ట్, ఆర్థోపెడిక్, జినిటోరినరి సర్జరీ, న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, పొలిట్రామా, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్స్, న్యూనాటాలజీ, నెఫ్రాలాజీ, న్యూరోలాజీ, పూల్వాలాజీ లాంటి సేవలు అందుబాలో ఉన్నాయని అన్నారు. అందువల్ల ఉద్యోగులు తమ ఆసుపత్రికి వచ్చి ఆరోగ్యశ్రీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.