నిజామాబాద్

నిజాం షుగర్స్ పునరుద్ధరించే వరకు పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, జూన్ 27: నిజాం చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వం పునరుద్ధరించేంత వరకు సమరశీల పోరాటాలు కొనసాగిస్తామని వక్తలు స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో నిజాం షుగర్స్ ఫ్యాక్టరీపై ఎన్‌ఎస్‌ఎఫ్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మొదటగా అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్ మాట్లాడుతూ, నిజాం షుగర్స్‌పై రక్షణ కమిటీ ఉద్యమం చేసినప్పుడల్లా రైతుల భాగస్వామ్యం - సహకార రంగం అని మాట్లాడుతున్న సిఎం కెసిఆర్, ప్రస్తుతం మూతబడ్డ నిజామాబాద్ సహకార చక్కెర కర్మాగారం ఎందుకు మూతబడిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్‌ఎస్‌ఎఫ్ ఆస్తులను, భూములను పెట్టుబడిదారులకు అమ్మడానికే ఈ సాచివేత ధోరణిని ప్రభుత్వం అవలంభిస్తోందన్నారు. ఈ కుట్రలు సాగకుండా ఎన్‌ఎస్‌ఎఫ్‌పై విధించిన లేఆఫ్‌ను ఎత్తివేసి, ప్రభుత్వమే నడిపేంత వరకు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య మాట్లాడుతూ, ఎన్‌ఎస్‌ఎఫ్‌పై రెండున్నరేళ్లుగా పోరాటం చేస్తున్నా, ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు. సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ, ఎన్‌ఎస్‌ఎఫ్ పరిధిలోని రైతులను చైతన్యపర్చి పెద్దఎత్తున పోరాటం చేయాలని, అలాగే కార్మికుల భాగస్వామ్యంతో అన్ని పార్టీలను కలుపుకుని ఉద్యమించాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి గంగాధరప్ప మాట్లాడుతూ, రెండున్నరేళ్లుగా ఎన్‌ఎస్‌ఎఫ్ పరిరక్షణ కమిటీ ఉద్యమించిన ప్రతీసారి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపి కవిత తదితర నాయకులు ఏదో ఒక ప్రకటన చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. టి.జెఎసి నాయకుడు భాస్కర్ మాట్లాడుతూ, చెరకు అందుబాటులో లేనందున ఎన్‌ఎస్‌ఎఫ్‌ను తెరువలేకపోతున్నామని ప్రభుత్వం తప్పడు ప్రచారం చేస్తోందని, ఈ ప్రచారాన్ని అందరూ ఖండించాలన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో ఎన్‌ఎస్‌ఎఫ్ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు రాఘవులు, వరదయ్య, సిఐటియు నాయకులు రమేష్‌బాబు, సిపిఐ నాయకుడు సుధాకర్, తెలంగాణ రచయితల వేదిక నాయకుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు.