నిజామాబాద్

నేడు మద్యం దుకాణాల లైసెన్సుల ఉత్తర్వులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, సెప్టెంబర్ 21: వచ్చే రెండేళ్ల కాల పరిమితి కోసం మద్యం దుకాణాల లైసెన్సులను కేటాయించేందుకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో లక్కీ డ్రా నిర్వహించనున్నారు. ఇప్పటికే వైన్‌షాపుల లైసెన్సుల కోసం నోటిఫికేషన్‌ను జారీ చేయడంతో, పెద్ద సంఖ్యలో దరఖాస్తులు దాఖలైన విషయం విదితమే. జిల్లాలోని 95మద్యం దుకాణాలకు గాను ఏకంగా 1332 దరఖాస్తులు వచ్చాయి. వాపసు చేయబడని సొమ్ము దరఖాస్తు రుసుము రూపంలోనే ప్రభుత్వానికి 13.32కోట్ల రూపాయల ఆదాయం సమకూరగా, లైసెన్సు ఫీజుల రూ పేణా ఖజానాకు మరింత గణనీయంగా ఆదాయం చేకూరనుందని స్పష్టమవుతోంది. దాఖలైన టెండరు ఫారాలను ఎక్సైజ్ అధికారులు ఆయా దుకాణాల వారీగా వేరు చేస్తూ, దరఖాస్తుదారులకు టోకెన్ నెంబర్లు కేటాయించారు. శుక్రవారం ఉదయం 10.30గంటలకు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్‌ల సమక్షంలో లక్కీ డ్రా ప్రక్రియ కొనసాగనుంది. ఒక్కో దుకాణం వారీగా దాఖలైన దరఖాస్తుల సంఖ్యకు అనుగుణంగా టోకెన్ నెంబర్లను ఓ బాక్సులో వేసి, అందరి సమక్షంలో డ్రా తీయనున్నారు. ఈ లక్కీ డిప్‌లో అదృష్టం వరించిన వారికి లైసెన్సులను కట్టబెట్టనున్నారు. డ్రా లో దుకాణం ఖరారైన వ్యాపారులు లైసెన్సు ఫీజు రుసుములో 1/3వంతు సొమ్మును అప్పటికప్పుడే చెల్లించాల్సి ఉంటుంది. అంటే నిజామాబాద్ నగరంలోని మద్యం దుకాణాలకు ఏడాదికి 55లక్షల రూపాయల చొప్పున లైసెన్సు ఫీజుగా నిర్ధారించారు. దీనిని ఏడాదిలో మూడు విడతలుగా చెల్లించే వెసులుబాటు కల్పించారు. దుకాణం లైసెన్సును దక్కించుకునే సమయంలోనే మొదటి విడతగా 18.33లక్షల రూపాయలను చెల్లించాల్సి ఉంటుందని నిబంధనల్లో పేర్కొన్నారు. అయితే దరఖాస్త్ఫురంతో పాటు ఇఎండి రూ పంలో 5లక్షల రూపాయలను టెండ రు దాఖలు చేసే సమయంలో చెల్లించినందున ఆ మొత్తాన్ని మినహాయిస్తూ మిగతా 13.33లక్షల రూపాయలను డ్రాలో దు కాణం దక్కించుకున్న వారు చెల్లించాలి. డి.డి లేదా ఛలానాల రూపంలో ఈ మొత్తాన్ని కట్టాల్సి ఉంటుంది. దీనికోసం లక్కీ డ్రాకు వేదికగా ఎంపిక చేసిన రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలోనే ఛలానాలు, డి.డిలు అందించే ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. లక్కీ డ్రాలో అదృష్టం వరించని మిగతా వారికి వాపసు చేయబడని లక్ష రూపాయలను మినహాయించుకుని, ఇఎండి రూపంలో కట్టిన 5లక్షల రూపాయలను మాత్రం వెనక్కి తిరిగి ఇవ్వనున్నారు. కాగా, లక్కీ డ్రా ప్రక్రియను ప్ర శాంత వాతావరణంలో, ఎలాంటి పొరపాట్లకు తావులేకుం డా నిర్వహించేందుకు వీలుగా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన అనంతరం రెండు రోజుల గడువు లభించడంతో లక్కీ డ్రా కోసం మరింత పక్కాగా ఏర్పాట్లు చేసేందుకు ఎక్సైజ్ అధికారులకు వెసులుబాటు కలిగింది. రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో కేవలం దరఖాస్తుదారులను మాత్రమే లోనికి అనుమతించేలా ఎంట్రీ పాస్‌లను అందజేశారు. మద్యం టెండర్ల ప్రక్రియకు ఎవరైనా అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించవచ్చనే అనుమానాలతో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.