నిజామాబాద్

మొక్కుబడిగా జెడ్పీ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, అక్టోబర్ 17: స్థానికంగా నెలకొని ఉన్న సమస్యలకు పరిష్కారం చూపే వేదికగా నిలవాల్సిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలు ప్రాధాన్యతను కోల్పోతున్నాయి. నిధులు కేటాయించడం లేదని, ప్రొటోకాల్ పాటించడం లేదంటూ ఇదివరకటి సమావేశాన్ని సభ్యులు మూకుమ్మడిగా బహిష్కరించడంతో వాయిదాపడిన జడ్పీ మీటింగ్‌ను తిరిగి మంగళవారం నిర్వహించారు. దాదాపు ఆరు మాసాల అనంతరం నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల సమావేశంగా దీనిని ఏర్పాటు చేయగా, పలు శాఖలపై మొక్కుబడి చర్చతోనే అయ్యిందనిపించారు. జిల్లాకు చెందిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఎంపిలు కల్వకుంట్ల కవిత, బిబి.పాటిల్, మెజార్టీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎమ్మెల్సీలంతా జెడ్పీ సమావేశానికి గైర్హాజరయ్యారు. కేవలం జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసన మండలి సభ్యులు మహ్మద్ షబ్బీర్‌అలీ, ఆకుల లలితలు మాత్రమే పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి పోచారం సహా మిగతా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు గైర్హాజరైన విషయాన్ని షబ్బీర్‌అలీ సమావేశంలో ప్రస్తావిస్తూ ఒకింత ఆవేదన వెలిబుచ్చారు. ఇదివరకటి సమావేశం వాయిదా పడిందని, తాజాగా నిర్వహించిన సమావేశానికి కూడా మంత్రి, ఎంపిలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకాకపోవడం వల్ల సమావేశానికి ప్రాధాన్యత తగ్గినట్లయ్యిందని, సమస్యలను వారి దృష్టికి తెస్తే పరిష్కారానికి నోచుకునేందుకు ఆస్కారం ఉండేదని అభిప్రాయపడ్డారు. దీనిపై ఎమ్మెల్యే సింధే వివరణ ఇస్తూ, జెడ్పీ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి పోచారం సిద్ధమై ఉన్న తరుణంలోనే సోమవారం రాత్రి ఆకస్మికంగా ముఖ్యమంత్రి కెసిఆర్ నుండి పిలుపు వచ్చిందని అన్నారు. త్వరలో ప్రారంభం కానున్న శాసన సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ముఖ్యులందరినీ రావాల్సిందిగా ఆదేశించడంతో మంత్రి పోచారంతో పాటు ఎమ్మెల్సీ విజి.గౌడ్ తదితరులంతా హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారని వివరించారు. అలాంటప్పుడు ప్రస్తుత సమావేశాన్ని సైతం వాయిదా వేసుకుని, మంత్రులు, ఎంపిలు అందుబాటులో ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకుని ఉంటే బాగుండేదని షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. అనంతరం విద్యుత్ శాఖపై చర్చ కొనసాగగా, ముఖ్యమంత్రి కెసిఆర్ మిషన్ కాకతీయ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా సదాశివనగర్‌కు హాజరైన సమయంలో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి 33/11కెవి సబ్ స్టేషన్‌లు 11, మరో 133/11కెవి సబ్‌స్టేషన్‌ను మంజూరు చేస్తూ, ఆరు మాసాల్లో పూర్తి చేస్తామని ప్రకటించారని షబ్బీర్‌అలీ గుర్తు చేశారు. సాక్షాత్తూ సిఎం ప్రకటన చేసినప్పటికీ, ఇంకనూ సబ్‌స్టేషన్ల నిర్మాణాలు పూర్తి కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి స్పందిస్తూ, తెరాస ప్రభుత్వ కృషితో ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం పూర్తిగా నివారించబడిందని, తెలంగాణ ఏర్పడితే చీకట్లు అలుముకుంటాయని అప్పటి సమైక్య రాష్ట్రంలోని చిట్టచివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను సవాల్‌గా తీసుకుని సిఎం కెసిఆర్ విద్యుత్ సమస్య తలెత్తకుండా ఎంతో ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టారని అన్నారు. సిఎం ప్రకటించిన వాటిలో ఇప్పటికే 7సబ్‌స్టేషన్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగతావి వివిధ దశల్లో ఉన్నాయని ట్రాన్స్‌కో ఎస్.ఇ ప్రభాకర్‌చే వివరణ ఇప్పించారు. అయితే తాను విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన ప్రాజెక్టుల కారణంగానే ప్రస్తుతం రాష్ట్రంలో కరెంటు సమస్య దూరమైందని, తెరాస ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ మూడున్నరేళ్ల కాలంలో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా ఒక్క యూనిట్ విద్యుత్‌ను సైతం ఉత్పత్తి చేయలేదని షబ్బీర్‌అలీ స్పష్టం చేశారు. కాగా, జిల్లాలో వ్యవసాయ రంగానికి 24గంటల కరెంటును అందించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ఉంచామని, ఇప్పటికే ఆయా ప్రాంతాల రైతాంగం, ప్రజాప్రతినిధులు కోరిన చోట రోజుకు 9గంటల స్థానంలో 12గంటలు, అంతకంటే ఎక్కువ సమయం పాటు త్రీఫేజ్ విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని ఎస్.ఇ ప్రభాకర్ పేర్కొన్నారు. అంతకుముందు విద్యాశాఖపై జరిగిన చర్చ సందర్భంగా ఉపాధ్యాయ ఖాళీలు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయని, ప్రత్యేకించి సరిహద్దు మండలాల్లో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని జుక్కల్ నియోజకవర్గంలోని జడ్పీటిసిలు, ఎంపిపిలు సభ దృష్టికి తెచ్చారు. వాటర్ గ్రిడ్ పనుల పురోగతిపై సంబంధిత అధికారులు నివేదిక చదివి వినిపిస్తుండగా, కామారెడ్డి పట్టణానికి నీటిని సరఫరా చేసే జలాల్‌పూర్ పథకం నిలిచిపోయి పక్షం రోజులవుతున్నా ఎందుకు స్పందించడం లేదని షబ్బీర్‌అలీ నిలదీశారు. వాటర్ గ్రిడ్ ద్వారా ఆవాస ప్రాంతాలకు అసలు ఎప్పటిలోగా తాగునీటిని అందిస్తారని ప్రశ్నించారు. డిసెంబర్ నెలాఖరు నాటికి అన్ని గ్రామాలకు గోదావరి జలాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేసేందుకు మరికొంత సమయం పడుతుందని అధికారులు సమాధానం ఇచ్చారు. ప్రభుత్వాసుపత్రుల్లో సరైన వైద్య సేవలు అందించని కారణంగా పేద కుటుంబాలకు చెందిన వారు సైతం కాన్పుల కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తూ ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందని పలువురు సభ్యులు ఆక్షేపించారు. దీనిపై నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి స్పందిస్తూ, ఇదివరకటితో పోలిస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు చాలావరకు మెరుగుపడ్డాయని, జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రిలో రోజుకు సగటున 30 నుండి 40వరకు ప్రసవాలు జరుగుతున్నాయని, ప్రజల్లోనూ ప్రభుత్వాసుపత్రుల పట్ల నమ్మకం పెరుగుతోందన్నారు. ఆసుపత్రుల్లో వైద్యుల ఖాళీలను భర్తీ చేసేందుకు, వౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందన్నారు. కాగా, ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులతో పాటు నెలల తరబడి వేతనాలు అందక కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సభ్యులు ఆవేదన వెలిబుచ్చారు. ఈ సమావేశానికి జడ్పీ చైర్మెన్ దఫేదార్ రాజు అధ్యక్షత వహించగా, కామారెడ్డి కలెక్టర్ సత్యనారాయణ, జడ్పీ సిఇఓ గోవింద్, డిసిసిబి చైర్మెన్ గంగాధర్‌రావు పట్వారి, జడ్పీ వైస్‌చైర్మెన్ గడ్డం సుమనారెడ్డితో పాటు ఆయా మండలాల జడ్పీటిసిలు, ఎంపిపిలు, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

నిండిన సింగూర్ ప్రాజెక్ట్
*ఉమ్మడి జిల్లాల రైతుల్లో హర్షం *సింగూర్ నీటితో నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలకళ
*ఐదున్నర టిఎంఎసీల సింగూర్ నీరు ఇస్తేనే సమస్య నుండి రైతులు గట్టెక్కేది

కామారెడ్డి, అక్టోబర్ 17: నిజామాబాద్ - కామారెడ్డి ఉమ్మడి జిల్లాలకు వరప్రదాయినిగా నిలుస్తున్న నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఈసారి నిండుతుందా లేదా అన్న సందిగ్ధంతో ఆయకట్టు రైతులు కొట్టుమిట్టారు. ఎట్టకేలకు వరుణుడి కరుణతో నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ భాగంలోని సంగారెడ్డి జిల్లాలో ఉన్న సింగూర్ ప్రాజెక్ట్ నిండింది. దీంతో ప్రాజెక్ట్‌లోకి వస్తున్న వరద నీరంతా కూడా దాదాపుగత వారం రోజుల నుండి సింగూర్ మూడు గేట్లను ఎత్తివేసి మంజీరనది ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్ట్ రిజర్వాయర్‌కులోకి పంపించారు. సింగూర్‌లో వరద తగ్గడంతో కేవలం ఒక్క వరదగేట్ ద్వారా కొద్దిపాటి నీటిని మంజీర ద్వారా నిజాంసాగర్ జలాశయంలోకి వదలుతున్నారు. సింగూర్ వరద నీటి పుణ్యమా అని నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయం నీటి మట్టం పెరుగుతూ పోతుండటంతో ఆయకట్టు రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలంలో ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్ట్ ద్వారా జిల్లాలోని కేవలం బాన్స్‌వాడ డివిజన్‌తో పాటు నిజామాబాద్ జిల్లాలోని బోధన్, ఆర్మూర్ డివిజన్‌లలో దాదాపు 1.50వేల ఎకరాలకు సాగునీరు అందిస్తూ వస్తుంది. నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయానికి ప్రధాన జలవనరులుగా సింగూర్ ప్రాజెక్ట్ పోచారం ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. చిన్న ప్రాజెక్ట్ అయిన పలు సార్లు నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ను పోచారం ప్రాజెక్ట్ ఆదుకోవడం గమనార్హం. పోచారం ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో చిన్నపాటి వర్షం పడితే లింగంపేట్ వాగు ద్వారా వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటం వల్ల పోచారం త్వరితంగా నిండుతోంది. ప్రాజెక్ట్ నిండిన తరువాత అదనంగా వస్తున్న నీరు అంతా కూడా ప్రాజెక్ట్ పై నుండి పొంగి పొర్లుతూ మంజీర ద్వారా నిజాంసాగర్ జలాశయంలోకి చేరుతోంది. నిజాం కాలంలో నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లో అసలే పూడిక పెరుకుపోయి నీటి సామర్ధ్యం రోజు రోజుకు పడిపోతూ ఉంది. దీనికి తోడు ప్రాజెక్ట్ ఎగువ భాగంగాలోని సంగారెడ్డి జిల్లాలో సింగూర్ ప్రాజెక్ట్, కర్నాటక రాష్ట్రంలో కరంజా ఇలా అనేక ప్రాజెక్ట్‌ల నిర్మాణంతో నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలోకి నీరు రావడం కష్టతరగంగా మారి ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. గత ఏడాది వర్షాకాలం సెప్టెంబర్ నెల చివరలో కురిసిన భారీ వర్షాల వల్ల సింగూర్ నిండిపోవడంతో అదనంగా వచ్చే నీటితో నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయం నిండింది. గత ఏడాది సెప్టెంబర్ చివరలో సింగూర్, పోచారం ప్రాజెక్ట్‌ల నుండి దాదాపు 76 టిఎంసీల నీరు నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లో రావడంతో 17టిఎంసీల నీటిని నిజాంసాగర్‌లో మెయింటేన్ చేస్తూ, మంజీర ద్వారా అదనంగా వచ్చే మొత్తం వరద నీటిని వరద గేట్లను ఎత్తివేసి గోదావరిలోకి వదిలిపెట్టిన విషయం పాఠకులకు విధితమే. ఈఏడాది కూడా ప్రాజెక్ట్‌లోకి నీరు రావడం ప్రారంభం అయినప్పటికీ, అక్టోబర్ 17వ తేది వరకు కూడా ఇంకా ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండలేదు. 1405.00 అడుగుల సామార్ధ్యంగా మంగళవారం సాయంత్ర వరకు ప్రాజెక్ట్‌లోకి 1399.50 అడుగులకు నీరు వచ్చి చేరిందని డిప్యూటి ఇఇ దత్తత్రీ తెలిపారు. ప్రాజెక్ట్ నిండాలంటే 5.5అడుగుల నీరు ప్రాజెక్ట్‌లోకి రావాల్సి ఉంది. టిఎంసీల్లో అయితే ప్రాజెక్ట్ నీటి సామార్ధ్యం 17.802 టిఎంసీలకు గాను ప్రస్తుతం 11టిఎంసీల నీరు నిజాంసాగర్ రిజర్వాయర్‌లో నిలువ ఉంది. మరో ఆరున్నర టిఎంసీల నీరు వచ్చి చేరితే నిజాంసాగర్ జలాశయం పూర్తి స్థాయిలో నిండుతోంది. దీని కోసం ప్రభుత్వం సింగూర్ నుండి మరో ఆరున్న టిఎంసీల నీరు నిజాంసాగర్‌లోకి వదలాల్సి ఉంది. దీనికి ప్రభుత్వం అంగీకారం కూడా తెలిపిన విషయం విధితమే. జల ఒప్పందం ప్రకారం ప్రతి ఏడాది సింగూర్ నిండితే 7టిఎంసీల నీరు ఇవ్వాల్సి ఉంది. కాని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కోరిక మేరకు సింగూర్ నుండి 9టిఎంసీల నీరు కావాలని సిఎం కెసిఆర్‌ను కోరడంతో దీనికి సిఎం కెసిఆర్ అంగీకరించిన విషయం కూడా పాఠకులకు విధితమే. కాని వరుణుడి కరుణ వల్ల సింగూర్ ప్రాజెక్ట్ నిండిపోయి అదనంగా ప్రకృతి పరంగా ప్రాజెక్ట్‌లోకి రావాల్సిన నీరు వచ్చినప్పటికీ ప్రాజెక్ట్ నిండలేదు. కాబట్టి ప్రభుత్వం ఒప్పుకున్న విధంగా సింగూర్ నుండి 7టిఎంసీల నీరు వదలాల్సి ఉంది. కాని ప్రాజెక్ట్‌లో 11టిఎంసీల నీరు ఉన్నందున కేవలం ఆరున్నర టిఎంసీలు కావాల్సి ఉంది. 7టిఎంసీలు కాకుండా ఆరున్న టిఎంసీల నీరు వదిలి నిజాంసాగర్ నింపాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సింగూర్ ప్రాజెక్ట్ జలాశయంలోకి 11వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ఒక ఫ్లడ్ గేట్ ద్వారా 8,100 క్యూసెక్కుల వరద నీరు మంజీర ద్వారా నిజాంసాగర్ జలాశయంలోకి వస్తుంది. అలాగే సింగూర్ జలవిద్యుత్ కేంద్రం నుండి 1460 క్యూసెక్కుల నీటిని విద్యుత్ ఉత్పాదన చేస్తూ నీటిని మంజీర ద్వారా నిజాంసాగర్‌లోకి విడుదల చేస్తున్నారు. ఈ సింగూర్ జలాశయంలో ఇన్‌ఫ్లో తగ్గడంతో వరద గేట్లను మూసి వేస్తున్నారు. జలాశయంలోకి వస్తున్న వరదను బట్టి వరదగేట్లను ఎత్తి నిజాంసాగర్ జలాశయంలోకి విడుదల చేస్తున్నారు. దీన్ని బట్టి చేస్తే సింగూర్ జలాశయంలోకి వరద వస్తేనే నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలోకి నీటిని విడుదల చేస్తున్నారే తప్ప, న్యాయపరంగా నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు విడుదల చేయాల్సిన 7టిఎంసీల నీటిని మాత్రం ఇవ్వాలన్న ఆలోచనలో ప్రభుత్వం లేదని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు సింగూర్ జలాశయంలోకి వస్తున్న వరదను గేట్లను ఎత్తివేసి నిజాంసాగర్ జలాశయంలోకి విడుదల చేస్తూ, వారు మాత్రం పక్క నీటి లెక్కలను వేస్కుంటూ నివేదికలు సిద్ధం చేసినట్లు సమాచారం. సిఎం కెసిఆర్ సింగూర్ నుండి నిజాంసాగర్ జలాశయంలోకి 9టిఎంసీల నీరు విడుదల చేయాలని సంబందిత శాఖ అధికారులను ఆదేశించడం గమనార్హం. సిఎం ఇచ్చిన మాట ప్రకారం 9టిఎంసీల నీరు నిజాంసాగర్‌లోకి విడుదల చేస్తారో లేదోనన్న రైతుల్లో ఇప్పటికి అనుమానంగా ఉంది. వరదనీటిటే 9టిఎంసీలుగా చూపిస్తే ఆయకట్టు రైతుల్లో మాత్రం ఆందోళన చేసే అవకాశం ఉంది. నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో 1లక్షల 50వేల ఎకరాల్లో రబీలో వరి పంటకు నీరు అందించేందుకు ఇక్కడి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికోసం ఆయకట్టు రైతులకు 14టిఎంసీల నీరు అవసరం ఉంది. ఈ ప్రాజెక్ట్ నుండి సాగునీటితో పాటు తాగునీటిని కూడా అందించాల్సి ఉంటుంది. కాని ప్రస్తుతం నిజాంసాగర్ జలాశయంలో ఉన్న 11టిఎంసీల నీరు రబీలో ఉమ్మడి జిల్లా ఆయకట్టు రైతులకు సాగుతో పాటు తాగునీటి అవసరాలు తీర్చే అవకాశం ఉండదు. కాబట్టి సిఎం ఇచ్చిన హామీ మేరకు 9టిఎంసీలు కాకున్న ఐదున్నర టిఎంసీలు నిజాంసాగర్‌కు సింగూర్‌ను వదిలితే తప్ప నిజాంసాగర్ ఆయకట్టు రైతులు రబీ సీజన్ నుండి గట్టెక్కడం కష్టం అని ఆయకట్టు రైతులు అంటున్నారు. ఇచ్చిన మాట ప్రకారం టిఆర్‌ఎస్ సర్కార్ నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ను నింపుతుందా లేదా వేచి చూడాల్సిందే.

రైస్‌మిల్లులపై విజిలెన్స్ దాడులు
* 1500 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం * బోధన్ కేంద్రంగా జోరుగా రీ సైక్లింగ్ దందా
బోధన్,అక్టోబర్ 17: నిజామాబాద్ జిల్లా బోధన్ కేంద్రంగా జోరుగా బియ్యం రీ సైక్లింగ్ దందా కొనసాగుతోంది. పేద ప్రజల కోసం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసిన బియ్యాన్ని కొందరు మిల్లర్లు రీ సైక్లింగ్ చేసి అంతర్ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. బోధన్‌కు మహారాష్ట్ర కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల ఈ అక్రమ దందాకు మంచి అవకాశంగా పరిణమించింది. కాగా విజిలెన్స్ అధికారులు పక్కా వ్యూహంతో దాడులు చేసి ఈ చీకటి వ్యాపారాన్ని గుట్టురట్టు చేశారు. మంగళవారం బోధన్ పట్టణ శివారులో గల బైపాస్ రోడ్‌లో ఉన్నటువంటి రెండు రైస్‌మిల్లుల గోదాములలో విజిలెన్స్ ఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. ఇందులో దాదాపు 36 లక్షల రూపాయల విలువ చేసే 1500 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యంను గుర్తించామని ఎస్పీ విలేఖరులకు వెల్లడించారు. ఈ బియ్యాన్ని మిల్లర్లు ప్రజల నుండి కొనుగోలు చేసి రీ సైక్లింగ్ చేసి తిరిగి వాటిని వివిధ పేర్లతో కూడుకున్న బ్యాగులలో నింపి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని ఆయన వివరించారు. పిడిఎస్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి అమ్మడం నేరమని కావున రైస్‌మిల్లు యజమాని ప్రభాకర్‌రెడ్డి పై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ మేరకు బియ్యాన్ని సీజ్ చేశామని విచారణ కొనసాగుతోందన్నారు. తమకు అందిన పక్కా సమాచారం మేరకు ఆటోలో బియ్యం తరలుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు తాము ఇక్కడికి వచ్చి తనిఖీలు చేయడం జరిగిందన్నారు. తాము రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం దాడులు చేయడంతో ఇక్కడి రీసైక్లింగ్ దందా బాగోతం బయటపడిందని తమ దాడులలో ఇంత పెద్ద మొత్తంలో పిడిఎస్ బియ్యం పట్టుబడటం ఏ నాడు జరుగలేదన్నారు. ఈ దాడులలో డిఎస్పీ శ్రీనివాస్, సిఐలు వినాయక్‌రెడ్డి, బాల్‌రెడ్డి, డిసిటివో ఉపేందర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ రమేష్, అసిస్టెంట్ ఇంజనీర్ రమణ, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.