నిజామాబాద్

ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని వృద్ధురాలు సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాక్లూర్, అక్టోబర్ 22: మాక్లూర్ మండలం కొత్తపల్లిలో ప్రమాదవశాత్తు నిప్పంటుకున్న సంఘటనలో వెంకటనర్సమ్మ(80) అనే వృద్ధురాలు సజీవ దహనమైంది. వెంకటనర్సమ్మ భర్త పాపయ్య 40 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆమె ఒక్కగానొక్క కుమారుడు ఉన్నత చదువులు చదివి ఉద్యోగంలో చేరిన తరువాత ప్రమాదంలో చనిపోయాడు. అప్పటి నుండి వెంకటనర్సమ్మ ఒంటరిగానే జీవనం వెళ్లదీస్తోంది. ఆమె నివసిస్తున్న ఇంటికి విద్యుత్ సౌకర్యం కూడా లేకపోగా, ఎనభై ఏళ్ల వయసులోనూ కట్టెల పొయ్యిపై వంట వండుకునేదని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం వంట చేస్తున్న సందర్భంగా ఆమె చీరకు నిప్పంటుకుని సజీవ దహనమైంది. మృతురాలి సోదరుడు వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ రామునాయుడు తెలిపారు.

స్వల్పంగా పెరుగుతున్న శ్రీరాంసాగర్ నీటిమట్టం
బాల్కొండ, అక్టోబర్ 22: తెలంగాణలోని భారీ ప్రాజెక్టులలో ఒకటైన మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం స్వల్పంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతమైన గోదావరి ద్వారా 2వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో, ఆదివారం సాయంత్రం నాటికి రిజర్వాయర్‌లో నీటిమట్టం 1081.00 అడుగులు, 55.23టిఎంసిలకు చేరుకుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. గత సంవత్సరం ఇదే రోజున రిజర్వాయర్ నీటిమట్టం 1091.00 అడుగులు, 90టిఎంసిలు ఉందన్నారు. ప్రస్తుతం కాకతీయ కాలువ ద్వారా 50 క్యూసెక్కులు, సరస్వతి కెనాల్ ద్వారా 600 క్యూసెక్కులు, లక్ష్మి కెనాల్ ద్వారా వంద క్యూసెక్కులు, గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల ద్వారా 135 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని, జూన్ మొదటి వారం నుండి నేటి వరకు 68.77టిఎంసిల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరిందని అధికారులు తెలిపారు.

నీటి కుంటలో పడి బాలుడు మృతి
మాక్లూర్, అక్టోబర్ 22: ఇంటి ఆరుబయట ఆడుకుంటున్న ఓ చిన్నారి ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందిన సంఘటన ఆదివారం మాక్లూర్ మండలం మామిడిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. డి.పెద్దులు కుమారుడైన మూడేళ్ల సుంకేశ్ ఆదివారం ఉదయం ఇంటి ఆరు బయట ఆడుకుంటున్నాడు. అతని తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు వివిధ పనుల్లో నిమగ్నమై ఉండి చిన్నారిని గమనించలేదు. ఈ క్రమంలోనే ఇంటికి ఆనుకుని సమీపంలో ఉన్న నీటి కుంటలో సుంకేశ్ ప్రమాదవశాత్తు పడిపోయి, ఊపిరాడక మృతి చెందాడు. కొద్దిసేపటి అనంతరం చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అతని కోసం పరిసర ప్రాంతాల్లో గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో నీటి కుంటలో విగతజీవిగా కనిపించిన సుంకేశ్‌ను చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెద్దులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని మాక్లూర్ ఎస్‌ఐ రామునాయుడు తెలిపారు.