నిజామాబాద్

నిజాంసుగర్స్ స్వాధీనానికి ఇక ఉద్యమ బాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, ఏప్రిల్ 11: నిజాంసుగర్స్ చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడిపించాలని రాష్ట్ర జేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. సోమవారం బోధన్ నిజాంచక్కెర కర్మాగారం పరిథిలోని హున్స, మందర్న, ఖాజాపూర్ గ్రామాలను ఆయన సందర్శించారు. ఈ ఏరియాలో రైతులు ఎక్కువగా చెరకు పంటను పండించడమే కాకుండా చెరకు రైతులు అధిక సంఖ్యలో ఉండటంతో వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా హున్స, మందర్న గ్రామాలలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చక్కెర కర్మాగారాలను తక్షణమే ప్రైవేటు వారి నుండి స్వాధీనం చేసుకోవాలని లేని పక్షంలో రైతుల పక్షాన జేఏసి ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. సుధీర్ఘ చరిత్ర కలిగిన ఈ కర్మాగారాన్ని కాపాడుకోవాల్సిన బాద్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఇక్కడి రైతులు చెరకును సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని కావున కర్మాగారం ప్రభుత్వ పరంగా నడిపించినట్లయితే ఈ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. బోధన్ మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ భూములు చెరకు మినహా ఇతర పంటలకు అనుకూలంగా లేవని కావున రైతులు చెరకును పండించేందుకే మక్కువ చూపుతున్నారని వివరించారు. ఇక్కడి చక్కెర కర్మాగారం వలన రైతులు అనేక విధాలుగా అభివృద్ధి చెందారని కావున ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, రైతుల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. జేఏసి ఇచ్చిన నివేదికను పరిగణనలోనికి తీసుకుని ప్రభుత్వం నిజాంసుగర్స్ కర్మాగారం వ్యవహారంలో స్పందిస్తుందని తాము ఆశిస్తున్నామని రైతుల మేలు కోరుతూ ప్రభుత్వం కర్మాగారాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం గనుక నిజాంసుగర్స్ వ్యవహారంలో స్పందించకుంటే జేఏసి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. జేఏసి ఆధ్వర్యంలో చేపట్టే ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు కదిలి రావాలని, పార్టీలకతీతంగా ఉద్యమిస్తేనే ఫ్యాక్టరీని కాపాడుకోగలుగుతామన్నారు. సమిష్టి పోరాటాల వల్లనే విజయాన్ని సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఫ్యాక్టరీ రక్షణ కమిటీ కన్వీనర్ రాఘవులు, సిపిఎం డివిజన్ నాయకులు గంగాధర్ అప్పా, శంకర్‌గౌడ్, సిపిఐఎంఎల్ న్యూ డెమొక్రసీ నాయకులు మల్లేష్, వరదయ్య, గుమ్ముల గంగాధర్, బోధన్ ఎంపిపి గంగాశంకర్, రైతు నాయకులు శివరాజ్, గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.