నిజామాబాద్

రాష్ట్రంలోని 906 సహకార సంఘాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజాంసాగర్, నవంబర్ 18: రాష్ట్రంలోని 906 ప్రాథమిక సహకార సంఘాలను అభివృద్ది చేయడమే సిఎం కెసిఆర్ ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుందని, రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖామాత్యులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని స్థానిక ఏఎంసీ గోదాంలోనిర్వహించిన 64వ అఖిల భారత సహకార వారోత్సవాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మంత్రి మాట్లాడారు. ముందుగా మంత్రి జ్యోతిని వెలిగించి వారోత్సవాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రప్రభుత్వం రైతులకు మద్దతు ధరను కల్పించేందుకు, రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసి, రైతుల భవిష్యత్తును మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్టవ్య్రాప్తంగా 10,773 గ్రామాల్లో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. త్వరలోనే జిల్లా రాష్ట్ర రైతు సమన్వయ సమితులను ఎన్నుకుంటామన్నారు. రైతులందరు సొసైటీలలోడబ్బులను డిపాజిట్ చేసేలా అధికారులు, సొసైటీ చైర్మన్‌లు కృషి చేయాలన్నారు. ప్రాథమిక సహకార సంఘాల్లో రైతు సమన్వయ కమిటీల మండల, గ్రామ పెత్తనం చలాయించరని, సమన్వయ కమిటి సభ్యులు రైతులను సమన్వయ పర్చి ఇబ్బందులు పడకుండా, ఆర్థికంగా అభివృద్ది చెందేలా కృషి చేస్తారన్నారు.రాష్ట్రప్రభుత్వం ఖరీఫ్, రబీలోవ్యవసాయ రంగానికి పుష్కలంగా సాగునీటిని అందించేందుకు కృషి చేస్తుందన్నారు. గోదావరి వృధా మళ్లింపు జలాలలను, నిజాంసాగర్ సింగూర్ జలాశయాల్లోకి నింపి ఆయకట్టు రైతుల పంటలకు సాగు నీరు అందించి, సస్యశ్యామలం చేస్తామన్నారు. జెడ్పీచైర్మన్ దఫేదార్ రాజు మాట్లాడుతూ, రైతులకు సహకార సంఘాల ద్వారా ఎరువులు, విత్తనాలు, రుణాలు అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నేను స్వయంగా 13 నెలలు సింగల్‌విండో చైర్మైన్‌గా పని చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో రైతులు ఎరవులు, విత్తనాల కోసం, క్యూలైన్ పాటించి, చెప్పులను వరుస క్రమంలో ఉంచిన సంఘటనలు ఉన్నాయన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం మూడున్నర సంవత్సర కాలంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను ఎన్నింటినో అమలు చేసి దేశంలోనే, తెలంగాణ రాష్టస్రిఎం కేసిఆర్ మంచి పేరుప్రఖ్యాతులు సంపాధించారన్నారు. వ్యవసాయరంగానికి ఆరు గంటల నుంచి మొదలు కుని, 24 గంటల నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. అతర్వాత మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని డిసిసిబి డైరెక్టర్ మోహన్‌రెడ్డి, శాలువా కప్పి పూలమాలలతోఘనంగా సత్కరించారు. సమావేశంలో కామారెడ్డి జిల్లాకలెక్టర్ డాక్టర్ సత్యనారాయణ, డిసిసిబి సిఈఓ అనుపమ, రాష్ట్ర సహాకార సంఘం ఎండి కిరణ్మయి, గ్రాంధాలయ సంస్థచైర్మైన్ సంపత్‌గౌడ్, డిసిఓ గంగాధర్, ఎఎంసి వైస్ చైర్మైన్ వెంకట్‌రాంరెడ్డి, డిసిసిబి డైరెక్టర్ మోహన్‌రెడ్డి, ఎంపిపి బుర్జుకింది సునంద గంగారెడ్డి, సిడిసి చైర్మైన్ దుర్గరెడ్డి, గున్కుల్, మల్లూర్ సింగల్ విండోల చైర్మైన్‌లు సయ్యద్ మొహిజొద్దిన్, రాధా విఠల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల రాస్తారోకో
భీమ్‌గల్, నవంబర్ 18: బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు కళాశాలకు వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఇటీవల రాస్తారోకో చేపట్టి అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండాపోయిందని విద్యార్థులు వాపోయారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా నాయకుడు జక్కుల కార్తీక్ మాట్లాడుతూ, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, పట్టించుకునే నాథుడే కరవయ్యారని ఆరోపించారు. భీమ్‌గల్ మండలంలోని మారుమూల గ్రామాల నుండి కళాశాలకు వచ్చే విద్యార్థిని, విద్యార్థులు బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. బస్సు సౌకర్యం లేని కారణంగా రహత్‌నగర్, దేవక్కపేట్, కారేపల్లి, దేవన్‌పల్లితో పాటు నర్సాపూర్, ఇనాయత్‌నగర్ తదితర గ్రామాలకు చెందిన పలువురు విద్యార్థులను చదువును మధ్యలో మానేసిన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ఈ విషయంలో సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి, విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, కళాశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.