నిజామాబాద్

పూడిక మట్టి బంగారంతో సమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జుక్కల్, ఏప్రిల్ 19: చెరువుల్లో పేరుకుపోయిన పూడిక మట్టిని వ్యవసాయ క్షేత్రాల్లో వినియోగిస్తే ఎలాంటి ఎరువులు అవసరం లేకుండానే పంటలు సాగు చేసినా అధిక దిగుబడులు పొందవచ్చని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని బంగారుపల్లి గ్రామంలో రెండవ దశ మిషన్ కాకతీయ పథకం కింద తాటికుంట చెరువులో 15.75లక్షలతో చేపట్టిన పూడిక తీత పనులను ప్రారంభించారు. ఈ నిధులతో చెరువులో పూడిక తీత, చెరువు, అలుగు పటీష్టం, పంట కాల్వలను నిర్మించడం తదితర పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. వచ్చే సీజన్ రైతుల కాలమే అయినందున గ్రామానికి ఆధారమైన చెరువు పునరుద్ధరణ పనులను ప్రతిష్ఠాత్మంగా భావించి ప్రతి ఒక్కరు పనుల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
బంగారుపల్లి గ్రామానికి తారురోడ్డును వేయించేందుకు నిధుల మంజూరీకి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనుల్లో అవినీతికి తావులేకుండా ఇరిగేషన్ అధికారులు పనులు చేయించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి సభ్యుడు మాధవరావుదేశాయి, గ్రామ సర్పంచ్ వెంకటరమణ సురేష్‌గొండ, మాజీ జడ్పీటిసి సాయాగౌడ్, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నీలుపటేల్, పార్టీ నాయకులు గంగాధర్, బాలాజీ, మారుతి, శివాజీ తదితరులు పాల్గొన్నారు.