నిజామాబాద్

మహా సరిహద్దులో జోరుగా మట్కా...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, మార్చి 18: మహారాష్టక్రు సరిహద్దులో ఉన్నటువంటి బోధన్ సబ్ డివిజన్‌లోని కొన్ని ప్రాంతాలు హైటెక్ పేకాట రాయుళ్లకు అడ్డాగా మారిపోయాయి. ఇక్కడ ఎటువంటి దాడులు జరుగయన్న ధీమాతో పేకాట నిర్వాహకులు ఈప్రాంతాలను ఎంచుకుని ఎంచక్కా జూదాన్ని నిర్వహిస్తున్నారు. పేకాట కేంద్రాలపై టాస్క్ఫోర్స్ దాడులు చేస్తున్నా స్థానికంగా అధికారుల వెంట ఉండే ఐడి పార్టీ పోలీసులు ఈ పేకాట గురించి తమకేమి తెలియనట్లు వ్యవహరించడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. హైటెక్ పేకాట నడిపించడం లో సరిహద్దులో ఉన్నటువంటి ఓ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరు ఎన్నో సంవత్సరాల నుండి సరిహద్దులో పేకాట నిర్వహిస్తూ ఇక్కడ దాడులు జరుగకుండా ఉండేందుకు అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీరిద్దరు వ్యక్తులు దాదాపు ఐదారు మంది యువకులను తమకు సహాయకులుగా పెట్టుకుని పోలీసులు దాడులు చేయకుండా ఉండేందుకు మాస్టర్ ప్లాన్‌తో పేకాటను నిర్వహించడం జరుగుతోంది. పోలీసు అధికారులు దాడు లు చేసేందుకు ప్లాన్ చేయగానే వారికి సమాచారం వచ్చే విధంగా వారు నెట్‌వర్క్ రూపొందించుకున్నారు. కొంతకాలం అడ్డాలు మార్చిన వీరు మళ్లీ సరిహద్దుకు చేరుకున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి రోజు వారీగా లక్షలాది రూపాయల జూదం ఆడుతూ ఇక్కడి నుండి తిరిగి తమ గ్రామాలకు తిరుగుముకం పడుతున్నట్లు తెలిసింది. ఈ ఇద్దరు వ్యక్తులు కేవలం పేకాట నిర్వహించడమే వృత్తిగా ఎంచుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నా అధికారులు వారి వైపు కనీసం కనె్నత్తి కూడా చూడక పోవడం గమనార్హం. ఇదిలా ఉండగా బోధన్ డివిజన్‌లోని కోటగిరి, పోతంగల్ ఏరియాలలో కూడా పేకాట జోరుగా సాగుతోంది. ఆదివారం ఏకంగా జిల్లా కేంద్రం నుండి టాస్క్ఫోర్స్ బృందం వచ్చి కోటగిరి మండలంలోని ఓ గ్రామంలో పేకాట స్థావరంపై దాడి చేసి పేకాట రాయుళ్లను అరెస్టు చేయడం జరిగింది. పోతంగల్, కోటగిరి గ్రామాలు మహారాష్టక్రు ఆనుకుని ఉండటం వలన ఇక్కడ పేకాటకు అనువుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రెంజల్ మండలంతో పాటు ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి, ఒడ్డెపల్లి, ఠాణాకలాన్ గుట్టలపై కూడా పెద్ద ఎత్తున పేకాట నడుస్తోందని ఆయా గ్రామాల ప్రజలు బాహాటంగా చెబుతున్నారు. ఈ గుట్టలపై ఉదయం నుండీ సాయంత్రం వరకు విందు భోజనాలు చేస్తూ పేకాటరాయుళ్లు లక్షలాది రూపాయల జూదం ఆడుతున్నారన్న ఆరోపణలున్నాయి. బోధన్ ఏరియాలో హైటెక్ పేకాట రాయుళ్ల సంఖ్య అధికంగా ఉంటుంది. వీరు ప్రతిరోజు ఏదో ఒక చోట పేకాట ఆడటం జరుగుతుంది. కానీ అధికారులు ఈ హైటెక్ పేకాట పై ఏ మాత్రం దృష్టి సారించలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. బోధన్‌కు చెందిన అనేక మంది పేకాట మాయలో పడి ఆస్థులు సైతం కోల్పోయారు. బోధన్‌కు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మరో గ్రామంలో ఓ వ్యక్తి జూదం కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రంపై కూడా పోలీసులు దాడులు చేసేందుకు ఏ మాత్రం సాహించకపోవడం గమ నార్హం. బోధన్ కేంద్రం మహారాష్టక్రు ఆనుకుని ఉండటం వలన ఇక్కడ పేకాటనే కాకుండా మట్కా సైతం జోరుగానే సాగుతోంది. ఇక్కడి అధికారులు గత రెండు నెలల క్రితం మట్కా రాయుళ్లపై ప్రత్యేక దృష్టి సారించి ముగ్గురు మట్కా రాయుళ్లను అరెస్టు చేసినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. గత కొనే్నళ్ల నుండి మట్కాకు అలవాటు పడిన వారంతా నేడు సెల్‌ఫోన్‌ల ద్వారా మట్కాను ఆడటమే కాకుండా కొందరు ఏజెంట్లుగా కూడా వ్యవహరిస్తున్నారు. పేకాట, మట్కా వంటి వాటిపై అధికారులు దృష్టి సారించక పోవడం అనేక విమర్శలకు దారి తీస్తోంది. సరిహద్దులో పేకాట జోరుగా సాగుతున్నా ఇక్కడి ఐడి పార్టీ కానిస్టేబుళ్లు కనీసం అధికారులకు సమాచారం ఇవ్వక పోవడం వెనుక మతలబు ఏమిటో అంతుచిక్కడం లేదు. అధికారుల వెంటే ఉంటూ సర్వం తామే అన్న చందంగా వ్యవహరిస్తూ అన్ని పనులు చేసే ఐడి పార్టీ పోలీసులకు మట్కా, పేకాట గురించి తెలియదా లేక ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా అన్నది అంతుచిక్కడం లేదు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులు ఈ ప్రాంతానికి కొత్త కావడంతో వారు క్రిందిస్థాయి వారిని అన్ని విషయాలలో నమ్ముతుండటం వలన వీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అసలు విషయాలను కప్పిపెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అన్నిరకాల సమాచారం కలిగి ఉండే ఐడి పార్టీ పోలీసులకు పేకాట, మట్కా గురించి ఎటువంటి సమాచారం లేకపోవడం వారి పనితీరుకు అద్ధం పడుతోంది. స్థానిక అధికారులు అప్రమత్తం కానట్లయితే ఈ ఏరియాలో ఈ వేసవిలో జూదం మరింత పెరిగే అవకాశాలు లేకపోలేవు.

తెలంగాణ వెంకన్నను దర్శించుకున్న పోచారం
నసురుల్లాబాద్, మార్చి 18: తెలంగాణ తిరుమల తిరుపతి దేవాలయంలో ఉగాది పండను పురస్కరించుకుని ఆదివారం ఆలయానికి చేరుకుని, ఆలయంలో వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం ఆవరణలో జాపల భాస్కర శర్మ ఆధ్వర్యంలో జరిగిన పంచాంగ శ్రవణంలో మంత్రి పాల్గొని పంచాంగాన్ని విన్నారు. అనంతరము మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది రాష్ట్రంలో వేంకటేశ్వరస్వామి ఆశీర్వాదంతో వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండి రైతులు హాయిగా ఉండాలన్నారు. ప్రజలందరు కొత్త సంవత్సరంలో సుఖసంతోషాలతో ఉండాలన్నారు. తెలంగాణ టీటీడీ ఆలయం అభివృద్ధి దిన దినాభివృద్ధి జరుగుతోందని, స్వామి వారి ఆశీర్వాదం అందరికి ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా స్వామి వారితీర్థ ప్రసాదాలు స్వీకరించి మంత్రి అక్కడి నుండి వెళ్లిపోయారు మంత్రి వెంట ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.