నిజామాబాద్

నీటి నిల్వలపై దృష్టి పెట్టకుంటే భవిష్యత్ ప్రశ్నార్థకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ోర్తాడ్, మార్చి 19: రోజురోజుకీ నీటి ఎద్దడి పెరుగుతూ సగటు మానవుడికి ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యం లో ఆ సమస్య పరిష్కారానికై ఇప్పటి నుండే దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గడిచిన దశాబ్దకాలంలోనే గ్రామీణ ప్రాంతాల్లోనూ నీటి నిల్వలపై అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇంటికో బావి ఉన్న తరుణం నుండి ఇంటికో కుళాయి వరకు పరిస్థితులు మారాయి. సాధారణంగా గ్రామీణప్రాంతాల్లో ప్రజలు ఏనాడు కూడా నీటి ఇబ్బందులు ఎదుర్కొలేదు. కేవలం చెరువులు, కుంటలపైనే ఆధారపడి మాత్రమే రైతాంగం వ్యవసాయం చేస్తున్న నేపథ్యంలో వీరికి వర్షాధారమే జీవనాధారంగా మారిందని చెప్పవచ్చు. భారీ వర్షాలు కురిస్తేతప్పా చెరువులు, కుంటలు నిండ ని పరిస్థితి. ప్రభుత్వాలు చేపడుతున్న ఎత్తిపోతలు, సాగునీటి పథకాలు పూర్తిస్థాయిలో సత్ఫాలితాలు ఇవ్వని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో బోరుబావుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. వ్యవసాయ భూములతో పాటు ప్రతిఇంట కూడా ప్రస్తుతం బోరుబావి ఉందంటే అతిశయోక్తి లేదు. చేతబావుల నుండి బోరుబావులు వచ్చినా కూడా నీటి ఇక్కట్లు తప్పకపోవడం వెనుక అడుగంటుతున్న భూగర్భ జలమట్టమే ప్రధాన కారణం అన్నది నిఫుణుల అభిప్రాయం. పూర్తిస్థాయిలో నీటిని వినియోగించుకుంటున్న ప్రజ లు, కురిసిన ప్రతివర్షపు చినుకు ఇంకేలా చర్యలు తీసుకోవడంలో మాత్రం దృష్టి సారించడం లేదన్న విమర్శలు లేకపోలేదు. భవిష్యత్ తరాలకు ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుడదంటే, ఇప్పటి నుండే నీటి పొదుపు, భూగర్భ జలమట్టం పెంపుదల అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిఫుణులు పేర్కొంటున్నారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామ శివార్లలో పాంపాండ్స్ నిర్మాణాలు, అదే సమయంలో బోరుబావుల నుండి యథేచ్ఛగా నీటిని తోడేస్తుంటే, భూగర్భ జలమట్టం పాతాళానికి పరులుగు తీస్తోం ది. ఒక సమయంలో 40్ఫట్లకే సమృద్ధిగా నీరు లభించే పరిస్థితి నుండి, ప్రస్తుతం 800్ఫట్లు వేసినా చుక్క నీరు రాని పరిస్థితికి దారి తీసిందంటే ప్రమాద తీవ్రతను అంచనా వేయవచ్చు. నూతన పథకాలు చేపట్టడంతో పాటు ఇప్పటివరకు చేపట్టిన పాం పాండ్స్, చిన్ననీటి కుంటలు, వాగుల్లోనూ, అటవీ ప్రాంతాల్లోనూ నిర్మించిన చెక్‌డ్యాముల్లో పూడికను తొలగించే ప్రయత్నం చేయాలని, అప్పుడే నీటి నిల్వలు పెరుగుతాయని ఆ ప్రాంత రైతులు అంటున్నారు. అడుగడుగునా పాంపాండ్స్ నిర్మాణాలతో పాటు చిన్ననీటి చెరువులను కూడా నిర్మించాలని రైతులు కోరుతున్నారు. దీనికి తోడుగా ప్రతి ఇంటా తప్పనిసరిగా ఇంకుడు గుంతను నిర్మించి పడిన వర్షపు జల ధారాలను అందులోకి మళ్లించే ప్రయత్నం చేయాలని నిఫుణులు చెబుతున్నారు. అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలు చేయూతను అందించినప్పుడే ప్రస్తుతం ఉన్న నీటి సమస్య భవిష్యత్‌లో ఏర్పడకుండా ఉంటుందన్నది నిర్వీవాద అంశం. ఈసారి ఇంటికో చెట్టు, ఇంటికో ఇంకుడు గుంత అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని, ప్రజలు కూడా సహకరించి ఈ కార్యక్రమానికి చేయూతను అందించాలని మండల అధికారులు కోరుతున్నారు.