నిజామాబాద్

గండిమాసానిపేట్‌లోఅగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డి, ఏప్రిల్ 21: మండలంలోని గండిమాసాని పేట్ గ్రామంలో గురువారం మద్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలోమూడు గుడిసెలకు నిప్పంటుకుని పూర్తిగా కాలిపోయిన సంఘటనలోఒక మహిళ సజీవ దహనం అయినట్లు స్థానిక ఎస్‌ఐ 2 పూర్ణేశ్వర్ తెలిపారు. ఎస్‌ఐ 2 తెలిపిన కథనం ప్రకారం పూర్తివివరాలు ఇలా ఉన్నాయి. గండిమాసాని పేట్ గ్రామానికి చెందిన తిరిష దుర్గవ్వ, తిరిష బాలయ్య, తిరిష బాబులకు చెందిన నివాసపుగుడిసెలు ప్రమాద వశాత్తుగా నిప్పంటుకోవడంతోపూర్తిగా కాలిపోయాయన్నారు. తిరిష దుర్గవ్వ ఇంటికి అట్కరి సాయవ్వ (58) చుట్టపుచూపుగా వచ్చి బోజనం చేసి పడుకున్న సమయంలోప్రమాద వశాత్తుగా గుడిసెకు నిప్పంటుకుని అక్కడికక్కడే సజీవ దహనం అయ్యిందన్నారు. మృతురాలి భర్త అట్కరి పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని, శవాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు. అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది గ్రామానికి చేరుకుని మంటలను ఆర్పివేసిందన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న స్థానిక తహశీల్దార్ నాగజ్యోతి, విఆర్‌ఓలు రవి, అంజయ్య సంఘటన స్థలానికి చేరుకుని పంచనామ నిర్వహించారు. తిరిష దుర్గవ్వ గుడిసెకు 45వేలు, తిరిష బాలయ్య 40 వేలు, తిరిష బాబు 40 వేల రూపాయల ఆస్తినష్టం వాటిల్లిందని తహశీల్దార్ తెలిపారు. అగ్ని ప్రమాద బాదితులను ప్రభుత్వం తరపున ఆదుకోవాలని స్థానిక సర్పంచ్ వెంకటేశం తహశీల్దార్‌ను కోరారు.