నిజామాబాద్

ఎగుమతులు పెరిగితేనే పసుపు రైతులకు మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూన్ 18: భారీగా పెట్టుబడులు పెడుతూ ఆరుగాలం శ్రమించి పసుపు పంటను సాగు చేస్తున్న ఇందూరు రైతాంగానికి శ్రమకు తగ్గ ప్రతిఫలం అందకపోగా, అనేక సందర్భాల్లో పెట్టుబడులు సైతం రాబట్టుకోలేక పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోవాల్సి వస్తోంది. నిలకడలేనిధరలే ఈ పరిస్థితికి చెప్పొచ్చు. నాణ్యతా ప్రమాణాల సాకుతో విదేశాలకు పసుపు ఎగుమతులు గణనీయంగా పడిపోవడంతో ఆశించినస్థాయిలో మద్దతు ధర లేదు. ఇదే అదనుగా స్థానిక ట్రేడర్లు, దళారులు కుమ్మక్కై ధరను మరింత గా కుదించివేస్తున్నారు. ఈ ఇబ్బందుల నుండి గట్టెక్కాలంటే పసుపు బోర్డు ఏర్పాటే ఏకైక మార్గమని రైతులు మూడు దశాబ్దాలుగా గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటం సాగిస్తూనే ఉన్నారు. బోర్డు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తూ ఎంపీ కవిత సైతం నాలుగు సంవత్సరాల నుండి కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే పసుపు బోర్డు ఏర్పాటుకు ససేమిరా అంటున్న కేంద్రం, స్పెషల్ టర్మరిక్ సెల్ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపింది. ఈ నేపథ్యంలో దీనిఏర్పాటువల్ల కలిగే ప్రయోజనాలతోపాటు, నాణ్యమైన పసుపు దిగుబడులు సాధించడం, ఎగుమతులను పెంపొందించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించేందుకు ఎంపీ కవిత చొరవతో సోమవారం రాష్ట్ర రాజధానిలో ఉన్నత స్థాయిలో వర్క్‌షాప్ నిర్వహించారు. వర్క్‌షాప్‌లో తీసుకున్న నిర్ణయాలతో తమకు ఏదైనా లబ్ధి చేకూరుతుందేమోనని పసుపు రైతులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. వర్క్‌షాప్‌లో ఎం.పీ కవితతోపాటు నిజామాబాద్ జిల్లాకుచెందిన ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, మహ్మద్ షకీల్, ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పసుపు ఎగుమతులు పెరిగితే పంటకు ధరకూడా ఆశించిన స్థాయిలో అంది రైతులు లాభపడేందుకు ఆస్కారం ఉంటుందని నిపుణులు, శాస్తవ్రేత్తలు అభిప్రాయపడ్డారు. దేశంలో పండిస్తున్న పసుపు పంటలో కేవలం 6శాతం మాత్రమే ఎగుమతి అవుతోందన్నారు. పసుపులో కర్కుమిన్ శాతాన్ని బట్టి అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ లభిస్తున్న దృష్ట్యా, నాణ్యమైన పసుపు సాగుచేసేలా శాస్తవ్రేత్తలు అధునాతన వంగడాలను రైతాంగానికి అందించాలని ఎంపీ కవిత కోరారు. పసుపు బోర్డు కోసం తీవ్ర స్థాయిలో కృషిచేస్తున్నప్పటికీ, కేంద్రం ఆసక్తి కనబర్చ డంలేదని, బోర్డుకు బదులుగా స్పెషల్ టర్మరిక్ సెల్ ఏర్పాటుకు కేంద్రమంత్రి సురేష్‌ప్రభు ముందుకొచ్చారని తెలిపారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలో పసుపు పార్క్‌కోసం రాష్ట్రప్రభుత్వం 42ఎకరాల స్థలాన్ని సేకరించి, రూ.30కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను తెలంగాణలో అనువైన ప్రాంతాల్లో ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని, ఉడకబెట్టిన పసుపును ఆరబెట్టేందుకు అధునాతన యంత్రాలు అందుబాటులో ఉన్నాయా? అన్నది అధ్యయనం చేయాలని శాస్తవ్రేత్తలను కోరారు.