నిజామాబాద్

పరిపూర్ణానందపై బహిష్కరణను ఎత్తేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, జూలై 17: హిందూ ధర్మాన్ని కించపరుస్తున్నారని, దీనిపై తాను మాట్లాడటానికి హైదరాబాద్ వచ్చానని శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణనందాస్వామి పేర్కొంటే, ప్రభుత్వం స్వామిజీని గృహ నిర్బంధం చేయడంతో పాటు నగర బహిష్కరణ విధించడం శోచనీయమని, దీనిని వెంటనే ఎత్తివేయాలని బీజీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు యెండల లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. శ్రీపీఠం పీఠాధిపతి అయిన పరిపూర్ణనందస్వామి, తాను హిందూ ధర్మం కోసం ప్రచారం చేసేందుకు హైదరాబాద్‌కు వచ్చానని పేర్కొంటే, ప్రభుత్వం గృహ నిర్బంధం చేసి, నగర బహిష్కరణ విధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల కోసమే టీఆర్‌ఎస్ పార్టీ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని, ఇందుకు ఆ పార్టీ రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అలాగే ఈ విషయాన్ని చెప్పేందుకు సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావులను సైతం అరెస్ట్ చేయడం శోచనీయమన్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో శాంతియుతంగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటే, బలవంతపు అరెస్ట్‌లు దేనికి సంకేతమని వారు ప్రశ్నించారు. గతంలో రజాకార్ల పాలనలో నిర్బంధం ఎలా కొనసాగిందో ప్రస్తుత టీఆర్‌ఎస్ పాలనలో అలాగే కొనసాగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 18న జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. దేశ, రాష్ట్ర ప్రజల మధ్య కొంతమంది వైషమ్యాలను సృష్టిస్తున్నారని వారు ఆరోపించారు. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై, ప్రభుత్వం ఇప్పటి వరకు చార్జ్‌షీట్ దాఖలు చేయకపోవడమే ఇందుకు నిదర్శమన్నారు. ఓట్ల కోసమే సీఎం కేసీఆర్ రాజకీయాలను దిగజార్చుతున్నారని, ఎంపీ అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీల చేతిలో సీఎం కేసీఆర్ కీలుబొమ్మగా మారారని వారు ఆరోపించారు. సీఎం కేసీఆర్ తన వైఖరిని మార్చుకోకపోతే హిందువుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. అనంతరం నగరంలోని దేవి థియేటర్ రోడ్డులో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఒక దశలో యెండల లక్ష్మినారాయణ ధర్నా నిర్వహించగా, పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. ఈ ఆందోళనలో బీజేపీ నాయకులు యెండల సుధాకర్, రోషన్‌లాల్‌బోరా, మల్లేష్‌యాదవ్, స్వామియాదవ్ పాల్గొన్నారు.