నిజామాబాద్

మొక్కజొన్నపై పాల్స్ ఆర్మీవార్మ్ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, ఆగస్టు 14: గ్రామాల్లో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంటపై పాల్స్ ఆర్మీవార్మ్ ఉద్ధృతి తీవ్రంగా ఉందని వ్యవసాయ అధికారులు గుర్తించారు. పలు ప్రాంతాల్లో మొక్కలు ఆశించిన రీతిలో ఎదగకపోవడంతో ఈ విషయాన్ని రైతులు అధికారుల దృష్టికి తెచ్చారు. దీంతో మంగళవారం వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ తన సిబ్బందితో కలిసి పలు గ్రామాల్లో క్షేత్రస్థాయికి వెళ్లి పంటలను పరిశీలించారు. స్పోడాప్టెరా ఫ్రూగీపెర్డా అనే కీటకం వల్ల ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. కీటకనాశిని కోసం మొక్కజొన్నను అంతర పంటగా సాగు చేయాలని, దీనివల్ల తల్లి పురుగు గుడ్డు పెట్టేందుకు ఇష్టపడదని రైతులకు సూచించారు. అంతేకాకుండా మిత్ర పురుగుల సంఖ్య కూడా పెరుగుతుందని తెలిపారు. పంటలో నేపియర్ గడ్డిని కూడా పెంచి, అక్కడక్కడా ఎకరానికి పది చొప్పున పక్షి ఈకలను ఉంచినట్లయితే వ్యాధి తీవ్రత తగ్గుతుందని అవగాహన కల్పించారు. ఎకరాన ఎనిమిది నుండి పది వరకు లింగాకర్షణ బుట్టలను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఐదు మి.లీ వేప గింజల కషాయాన్ని లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలని, కీలక ఉద్ధృతి తక్కువగా ఉన్న సమయంలో క్లోరోఫైరిపాస్ లేదా క్వినాల్‌ఫాస్ 25ఈసీ అనే ద్రావకాన్ని రెండు మి.లీలు చొప్పున ఒక లీటరులో కలిపి పిచికారి చేయాలన్నారు. పంటలో పురుగు ఉద్ధృతి మరీ ఎక్కువగా ఉంటే ల్యాండాసైహలోథ్రిన్ లేదా ఇండిక్సోకార్బ్‌ను వాడాలని సూచించారు.

ఘనంగా షిండే జన్మదిన వేడుకలు
బిచ్కుంద, ఆగస్టు 14: జుక్కల్ శాసన సభ్యుడు హన్మంత్ షిండే జన్మదిన వేడుకలను మంగళవారం బిచ్కుంద మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. షిండే బర్త్‌డే సందర్భంగా తయారు చేయించిన కేక్‌ను కట్ చేసి తీపిని పంచుకున్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని రోగులకు పండ్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మెన్ శ్రీహరి రాజు మాట్లాడుతూ, జుక్కల్ నియోజక వర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే షిండే కలకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, జుక్కల్ సెగ్మెంట్‌లో మరింత ప్రగతికి భగీరథుడిలా పాటు పడాలని అభిలషిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీ ఆర్ సుభీక్షమైన పాలనను అందిస్తున్నారని, పల్లెలు నేడు ప్రగతి పథంలో పరుగులు తీస్తున్నాయని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందుతున్నాయంటే అందుకు కార్యదీక్షతతో ముందుకు పోతున్న సీఎం చలువేనన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందని చెప్పారు. నిరుపేదలకు నీడను అందించాలన్న సంకల్పంతో డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేస్తున్నారని తెలిపారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.